📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest News: Lava Shark 2: మార్కెట్లోకి లావా స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా మరోసారి భారత మార్కెట్‌ (Indian market) లో తనదైన గుర్తింపును పొందేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లావా కంపెనీ (Lava Company) తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో పలు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తెచ్చి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.

Ratan Tata : రతన్ టాటా బాలీవుడ్ ప్రయోగం ‘ఏత్‌బార్’ ఫ్లాప్, కానీ

ఇప్పుడు అదే సక్సెస్‌ను కొనసాగించాలనే లక్ష్యంతో కొత్త మోడల్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం విడుదలైన లావా షార్క్ 5జీ సిరీస్‌ (Lava Shark 5G Series) కు కొనసాగింపుగా, సంస్థ ఇప్పుడు “లావా షార్క్ 2” పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది.

కంపెనీ తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు టెక్ ప్రేమికుల్లో పెద్ద ఆసక్తిని రేపుతున్నాయి.లావా షార్క్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల భారీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అమర్చారు.

పాత మోడల్ అయిన లావా షార్క్

గేమింగ్, వీడియో వీక్షణ అనుభూతిని మెరుగుపరిచేందుకు వీలుగా దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందించారు. పాత మోడల్ అయిన లావా షార్క్ 5జీలో 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండగా, కొత్త మోడల్‌లో దీనిని అప్‌గ్రేడ్ చేయడం విశేషం.

Lava Shark 2

డిస్‌ప్లే మధ్యలో సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ డిజైన్‌ను ఇచ్చారు.ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్ డిజైన్, కెమెరా వివరాలను టీజర్ల రూపంలో విడుదల చేసింది. లావా షార్క్ 2 ఫోన్ గ్లాసీ బ్యాక్ ప్యానెల్‌తో రానుంది. వెనుకవైపు ఎడమ మూలన చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉంది.

కెమెరా సెటప్‌ను అమర్చినట్లు కంపెనీ

ఇది ‘లావా బోల్డ్ ఎన్1 ప్రో’ మోడల్‌ను పోలి ఉండటం గమనార్హం. ఇందులో 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా (Triple rear camera) సెటప్‌ను అమర్చినట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులోకి రానుంది.ఫోన్ కనెక్టివిటీ, ఇతర పోర్టుల విషయానికొస్తే, కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండగా,

ఎడమవైపు సిమ్ ట్రే కోసం స్లాట్ ఇచ్చారు. ఫోన్ కింద భాగంలో స్పీకర్ గ్రిల్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్టు ఉన్నాయి. దాదాపు అన్ని ఫీచర్లు బయటకు వచ్చినప్పటికీ, ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల అవుతుంది, ధర ఎంత ఉంటుందనే విషయాలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Lava Shark 2 Lava smartphone Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.