దేశంలో సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడం వంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే నిబంధనలు పాటించని సంస్థల పట్ల RBI కఠినంగా వ్యవహరిస్తుంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) పై కఠిన చర్యలు తీసుకుంటుంది. పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌లకు చెందిన నాలుగు NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను RBI ఇటీవల రద్దు చేసింది. RBI NBFC Cancellation చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) కింద RBI కి ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ చర్య తీసుకుంది.
Read Also: Bihar: నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ప్రశంసలతో ముంచెత్తిన రోహిణి ఆచార్య
రద్దు చేయబడిన NBFCలు ఇవే.. రీసెంట్ గా RBI.. వెస్ట్ బెంగాల్ కు చెందిన జెమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ & ట్రేడింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్, విస్తార్ ఫైనాన్సియర్స్, అంబికా బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లైసెన్స్ ను రద్దు చేసింది. అలాగే చండీగఢ్‌కు చెందిన శ్రీ లఖావి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లైసెన్స్ ని కూడా రద్దు చేసింది. కారణం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన కనీస ప్రమాణాలను, మార్గదర్శకాలను పాటించకపోతే, RBI ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ చర్య ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి అలాగే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి చాలా అవసరం. ఈ నాలుగు సంస్థలు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే RBI ఆయా లైసెన్స్ ను రద్దు చేసింది.
వడ్డీ రేట్లను తగ్గించిన RBI!
తమ పేరెంట్ కంపెనీ రద్దు అవ్వడంతో ఇంటెల్ ఇన్వోఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగోత్రి కమోడిటీస్ & ఫిన్‌వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ & పెర్కిన్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు స్వచ్ఛంగా లైసెన్స్ ను సరెండర్ చేశాయి. బ్యాంక్‌పై జరిమానా NBFC లపై చర్యలతో పాటు RBI ఒడిశాలోని పర్లఖేముండిలో ఉన్న ది కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పై రూ. 13,000 జరిమానా విధించింది. ఈ చర్యకు కూడా RBI ఆదేశాలను పాటించకపోవడమే కారణం. RBI యొక్క ముందస్తు అనుమతి లేకుండా మూలధన వ్యయాన్ని (Capital Expenditure) ఖర్చు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: