శ్రీకాళహస్తి : సాధారణంగా గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేయటం గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేసి అభిషేకాలు, అలంకారాలు నిర్వహించటం ఆనవాయితి. అయితే నవగ్రహాలు, 27 నక్షత్రాలను తన అలంకారకవచంలో పొందుపరచుకున్న స్వయంభువు వాయులింగేశ్వరుని సన్నిధిలో ‘గ్రహణ సమయంలో శాంతి అభిషేకాలు నిర్వహించటం ఆనవాయితి. అయితే ఈ అభిషేకాలకు అంచనాలకు మించిన రద్దీ ఏర్పడుతుంది. ఎన్ని సార్లు శాంతి అభిషేకాలు నిర్వహిస్తున్న ఆలయాధికారుల్లో మార్పు లేదు. ముందు జాగ్రత్త లేదు. విఐపిల దర్శనాలకు ఇస్తున్న ప్రధాన్యత సామాన్య భక్తుల దర్శనాలకు ఇవ్వటం లేదు.
విభిన్న సంప్రదాయం
‘గ్రహాణాల’ సందర్భంగా. దేవాలయాలను మూసివేయటం గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేయటం, పూజలు నిర్వహించటం అనవాయితి. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో భిన్న రీతిలో ఆచార వ్యవహారాలుంటాయి. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయం (Srikalahasti Temple) భక్తులు, విఐపీలతో కిట కిట లాడింది. దాంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అధికారులు ముందుగానే భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఆలయానికి భక్తుల తాకిడి పరిమితంగా ఉంటుంది. మధ్యాహ్నం రాహుకాల సమయంలో మాత్రం రద్దీ ఉంటుంది.
అలాంటిది ఆదివారం గ్రహణం సందర్భంగా భక్తులు పోటేత్తారు. వేలాది మంది హాజరు కాగా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చంద్రగ్రహణం రాత్రి వేళల్లో రావటంతో మధ్యాహ్నం నుంచి జిల్లాలోని ఆలయాలన్ని మూసివేయటంతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శరానికి భక్తులు, విఐపిలు పోటేత్తారు. ఓ వైపు గ్రహణం (eclipse) మరో వైపు పవిత్రోత్సవాల ముగింపుతో ఆలయం కిట కిట లాడింది. ఉదయం నుంచి ఆలయంలో పవిత్రోత్స వాల ముగింపు సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసారు. వచ్చిన భక్తులు దర్శనానికి పోటెత్తారు. ఆలయం భక్తి భావంతో పునీతమైంది.
గ్రహణ కాల శాంతాభిషేకం:
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే గ్రహణ కాలాభిషేకంను శాంతి అభిషేకంగా నిర్వహించిన్నట్లు అందుకు సంబంధించిన వివరాలను ఆలయ పౌరోహితులు అర్ధగిరి స్వామి వివరించారు. సాధారణంగా గ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేసి గ్రహణం వీడిన తరువాత ఆలయాన్ని తీసి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తరువాత దర్శనాలకు అనుమతించటం జరుగుతుం దన్నారు.
అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి 9గంటల 39 నిముషాల నుంచి సోమవారం వేరువ జాము 1.20గంటల వరకు గ్రహణంలో స్వామి అమ్మవార్లను శాంతిపజేయుటకు అభిషేకాలను నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు కాలాల్లో అభిషేకాలు నిర్వహించటం ఆనవాయితి. ఈ నేపథ్యంలో ఆలయం రాత్రి 9.30 గంటలకు మూసి వేసి రాత్రి గ్రహణ కాలంలో అర్చకులు మాత్రమే అభిషేకాలను నిర్వహించారు. అయితే గ్రహణ కాలాభిషేకం సందర్బంగా దర్శనానికి ఇఓ పై వత్తిడి వచ్చినా అనుమతించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read also: