సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna District) లో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం వెల్లడించారు. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీగా మద్యం కొనుగోలులు నమోదయ్యాయి.ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజులలోనే మొత్తం రూ. 38 కోట్ల సేల్స్ నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు రూ. 4 కోట్లు పెరిగాయి. జిల్లాలో జరిగిన కోడిపందేలూ,
Read Also: AP Health Alert: కొత్త ఏడాది నుండి 144 స్క్రబ్ టైఫస్ కేసులు

మద్యం అమ్మకాలు
పండుగకు వచ్చిన భారీ జనసందోహం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిపారు. జనవరి 15, 16 తేదీల్లో డిపోలకు సెలవు ఉండటం వల్ల ఆ రోజుల్లో విక్రయాలు జరగలేదు. ఇక ఈసారి కోడి పందేల బరులు కూడా భారీగా పెరగడం మద్యం అమ్మకాలను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: