📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News:  Jyotiraditya Scindia: త్వరలోనే  BSNL 5G సేవలు: మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

Author Icon By Aanusha
Updated: October 5, 2025 • 9:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యంలో ఉన్న టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ తిరిగి తన ప్రభావాన్ని చూపే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, దేశీయంగా అభివృద్ధి చేసిన 4G నెట్‌వర్క్‌ను రాబోయే 6 నుంచి 8 నెలల్లో 5G సేవలకు అప్‌గ్రేడ్ చేయనున్నారు.

DND App: స్పామ్ కాల్స్ వస్తే.. ఇలా చేసి చూడండి

త్వరలోనే బీఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుంది.ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘కౌటిల్య ఎకనామిక్ సదస్సు 2025’ (‘Kautilya Economic Summit 2025’) లో ఆయన మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు.

భారతదేశం తన సొంత 4G ప్రమాణాలతో సాంకేతిక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఇది దేశ ఆవిష్కరణ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. “ఇంతటితో మేము ఆగిపోము. రాబోయే 6-8 నెలల్లో ఈ 4G టవర్లను 5G నెట్‌వర్క్‌గా మారుస్తాం. దేశవ్యాప్తంగా ఎండ్-టు-ఎండ్ 5G సేవలను అందిస్తాం” అని సింధియా స్పష్టం చేశారు.

Jyotiraditya Scindia

గత నెలలో బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన ‘స్వదేశ్ 4G నెట్‌వర్క్’

గత నెలలో బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన ‘స్వదేశ్ 4G నెట్‌వర్క్’ లేదా భారత్ టెలికాం స్టాక్‌ను పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT), తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ సహకారంతో ఈ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు.

ఈ ఘనతతో, సొంతంగా టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐదు దేశాల సరసన భారత్ చేరిందని ఆయన గుర్తుచేశారు.17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీఎస్ఎన్ఎల్ మళ్లీ లాభాల బాట పట్టిందని సింధియా తెలిపారు. కేవలం ఏడాది కాలంలోనే సంస్థ చందాదారుల సంఖ్య 78 లక్షల నుంచి 2.2 కోట్లకు పెరిగిందని వివరించారు.

ఈ కొత్త నెట్‌వర్క్ ద్వారా ఇప్పటికే 26,700 గ్రామాలకు తొలిసారిగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ వ్యవసాయం, టెలిమెడిసిన్ వంటి సేవలు మరింత విస్తృతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News BSNL 4G upgrade BSNL 5G BSNL users Digital India Government news Indian telecom Jyotiraditya Scindia latest news Make in India Telecom updates Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.