అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) (Johnson’s Company) ఇప్పుడు న్యాయపరంగా తీవ్రమైన సమస్యల్లో ఉంది. మనం రోజూ ఉపయోగించే బేబీ షాంపూలు, పౌడర్లు, బాడీ ఆయిల్, హెయిర్ ఆయిల్ వంటి అనేక ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తుంది.
Read Also: Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు
అయితే, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా, జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson’s Company) తయారు చేసే బేబీ పౌడర్‌లో క్యాన్సర్ రోగానికి కారణమయ్యే ఆస్బెస్టాస్ (Asbestos) ఉండొచ్చని బాధితులు ప్రకటించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, కంపెనీపై న్యాయపోరాటాలు కొనసాగుతున్నాయి.
ఇలాంటి ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సీరియస్‌గా తీసుకోవాలి. ఆస్బెస్టాస్ అనేది ఒక రకం మినరల్, ఇది శ్వాసకోశాలలో కణజాల నష్టాన్ని, క్యాన్సర్ సమస్యలను కలిగించగలదు. బేబీ పౌడర్ వంటి రోజువారీ ఉత్పత్తుల్లో దీని ఉనికిని నిర్లక్ష్యం చేయడం, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యానికి హానికరం.
యూకేలో ఇప్పటికే 3 వేల మంది బాధితులు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ (Johnson and Johnson Company) పై న్యాయపోరాటానికి దిగారు. వారు ఈ ఉత్పత్తులు హానికరమని, పిల్లలకు ప్రమాదకరమని, దీని వల్ల జీవితంలో అనారోగ్య సమస్యలు రావచ్చని దావా చేశారు.
జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేసే బేబీ పౌడర్‌లో ముఖ్య పదార్ధమైన టాల్క్ అనే సహజంగా లభించే ఖనిజం.. తరచుగా ఆస్బెస్టాస్ నిక్షేపాల దగ్గర లభిస్తుందని.. దీని కారణంగా మైనింగ్ సమయంలో కాలుష్యం జరిగే అవకాశం ఉందని బాధితుల తరఫు న్యాయవాదులు దావాలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ దావా ప్రకారం.. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల్లో ట్రెమోలైట్, యాక్టినోలైట్ వంటి ఫైబరస్ ఖనిజాలు కూడా ఉన్నాయని.. ఇవి ఆస్బెస్టాస్‌గా పేర్కొంటారని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: