हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

News Telugu: Jio: రూ.799కే సేఫ్టీ ఫోన్లు ..ఇక ఫ్రీగా ఏఐ కోర్సు

Rajitha
News Telugu: Jio: రూ.799కే సేఫ్టీ ఫోన్లు ..ఇక ఫ్రీగా ఏఐ కోర్సు

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో JIO మరోసారి టెక్‌ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025 వేదికగా, భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కొత్త ‘జియో భారత్ సేఫ్టీ ఫోన్లు’ ఆవిష్కరించింది. పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్లు కేవలం రూ.799 నుంచే ప్రారంభమవుతున్నాయి.

AP banks: 4 బ్యాంకులు విలీనం తో సేవలు బంద్

Safety phones for Rs. 799

Safety phones for Rs. 799

భద్రతా ఫీచర్లు

ఈ ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్, యూజేజ్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక ఫీచర్లను జియో అందిస్తోంది.

  • లొకేషన్ ట్రాకింగ్ ద్వారా యూజర్లు తమ ప్రస్తుత స్థానం నమ్మకమైన కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.
  • యూజేజ్ మేనేజ్‌మెంట్ టూల్‌ సహాయంతో సంరక్షకులు ఎవరెవరికి కాల్‌ చేయాలి, మెసేజ్‌ పంపాలి అనే నియంత్రణ కలిగి ఉంటారు.
  • అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే సౌకర్యం ఉంది.
  • ఒకసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

అందుబాటు

ఈ జియో భారత్ ఫోన్లు దేశవ్యాప్తంగా ఉన్న జియో స్టోర్లు, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరియు ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో లభ్యం కానున్నాయి. కుటుంబ సభ్యులను సోషల్ మీడియా లేదా తెలియని కాల్స్‌ నుంచి దూరంగా ఉంచాలనుకునే వారికి ఈ ఫోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జియో వెల్లడించింది.

ఉచిత ‘జియో ఏఐ క్లాస్‌రూమ్’ కోర్సు

ఇదే కార్యక్రమంలో జియో మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రకటించింది. విద్యార్థుల్లో కృత్రిమ మేధస్సుపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ‘జియో ఏఐ క్లాస్‌రూమ్’ అనే ఉచిత ఫౌండేషన్ కోర్సును ప్రారంభించింది.

  • ఈ కోర్సు జియో ఇన్‌స్టిట్యూట్తో కలిసి రూపొందించబడింది.
  • నాలుగు వారాల పాటు సాగే ఈ కోర్సులో ఏఐ ప్రాథమికాలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ Engineering వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
  • ఈ కోర్సును జియోపీసీ, ల్యాప్‌టాప్‌లు, లేదా జియో సెట్‌టాప్ బాక్స్ సహాయంతో స్మార్ట్ టీవీల్లో యాక్సెస్ చేయవచ్చు.
  • కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్, అలాగే జియో ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికెట్ లభిస్తుంది.

జియో ప్రకారం, సురక్షిత టెక్నాలజీతో పాటు విద్యా అవకాశాలను అందించడం ద్వారానే భారతీయ కుటుంబాలకు నిజమైన డిజిటల్ స్వావలంబన సాధ్యమవుతుందని సంస్థ భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870