2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా (JIO) 5G వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు దాటింది, ఇది మొత్తం మొబైల్ కస్టమర్లలో 32 శాతానికి సమానం. రిలయన్స్ జియో ఈ రంగంలో అగ్రగామిగా నిలిచి, సెప్టెంబర్ 2025 నాటికి 50 కోట్ల మొబైల్ వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ జియో (JIO) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, 3.2 కోట్ల వైర్‌లెస్ వినియోగదారులతో పాటు 20 లక్షల వైర్‌లైన్ వినియోగదారులను కలిగి ఉంది.
Read Also: ED: నేషనల్ హెరాల్డ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
100 కోట్లను లక్ష్యం
ప్రభుత్వం 2026 నాటికి 43 కోట్ల 5G వినియోగదారులను, 2030 నాటికి 100 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైన 5G సేవలు ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరడం భారత టెలికాం రంగంలో చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: