రిలయన్స్ మరియు వాల్ట్ డిస్నీ భాగస్వామ్యంతో ఏర్పడిన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద OTT సేవా వేదికగా నిలిచింది. రిలయన్స్ జియో వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఈ గౌరవాన్ని ప్రకటించారు.సినిమా థియేటర్లు, టెలివిజన్ కన్నా ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా OTT ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా కంటెంట్ చూడగలగడం వల్ల ఈ వేదికల ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ మార్పుతో జియో హాట్‌స్టార్ మరింత వేగంగా ఎదిగింది.ప్రస్తుతం మొత్తం టీవీ మార్కెట్‌లో 34 శాతం వాటా జియో ఖాతాలో ఉంది. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ, ఇతర డిజిటల్ కనెక్షన్ల ద్వారా వందల కోట్ల మందికి కంటెంట్ అందిస్తోంది. త్వరలో ఈ సేవలను మరిన్ని దేశాలకు విస్తరించాలన్నది కంపెనీ ప్రణాళిక.
విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ
ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో 3.20 లక్షల గంటల కంటెంట్ అందుబాటులో ఉంది. జియో తర్వాతి రెండు ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ కలిపినా, అంత పెద్ద మొత్తంలో కంటెంట్ ఉండదని ఆకాష్ అంబానీ వివరించారు. ప్రతి సంవత్సరం 30 వేల గంటలకు పైగా కొత్త కంటెంట్‌ను యాడ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నట్టు తెలిపారు.జియో హాట్‌స్టార్‌లో ప్రస్తుతం 600 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. వీరిలో 300 మిలియన్ల మంది చందాదారులు డబ్బు చెల్లించి కంటెంట్‌ను చూస్తున్నారు. ఈ సంఖ్య ప్రపంచ OTT రంగంలో ఒక పెద్ద రికార్డు.హాట్‌స్టార్‌తో కలిసిన తర్వాతే ఈ స్థాయిని చేరుకున్నామని ఆకాష్ అంబానీ చెప్పారు. కంటెంట్ నాణ్యత, టెక్నాలజీ సౌలభ్యం, వినియోగదారుల అనుభవం అన్నీ కలిపి జియో హాట్‌స్టార్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చాయని ఆయన తెలిపారు.
గ్లోబల్ OTT ర్యాంకింగ్స్
ప్రస్తుతం ప్రపంచంలో నెట్‌ఫ్లిక్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. దాని తర్వాత జియో హాట్‌స్టార్ రెండవ స్థానంలో, ఇక అమెజాన్ ప్రైమ్ మూడవ స్థానంలో ఉందని అంబానీ వెల్లడించారు.రాబోయే రోజుల్లో మరిన్ని దేశాల్లోకి ప్రవేశించి, వినియోగదారులకు కొత్త కంటెంట్, మెరుగైన అనుభవం అందించాలన్నది జియో ప్రణాళిక. గ్లోబల్ OTT రంగంలో భారతీయ వేదిక ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ఆకాష్ అన్నారు.
Read Also :