Jio Annual Plan: జియో నుంచి ఏఐ ధమాకా ఆఫర్

Read Time:  1 min
Jio Annual Plan: జియో నుంచి ఏఐ ధమాకా ఆఫర్
FONT SIZE
GET APP

Jio Annual Plan: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఒక సంచలన వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.3,599 రీఛార్జ్‌తో ఏడాది పొడవునా టెలికాం సేవలను అందించడమే కాకుండా, ఏకంగా రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతికతను అమితంగా ఇష్టపడే ఏఐ ప్రియులకు ఇది ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.

Read Also: Amazon : షాపింగ్ స్టైల్ మార్చేస్తున్న అమెజాన్..

ప్లాన్ వాలిడిటీ, డేటా ప్రయోజనాలు

తరచూ రీఛార్జ్‌లు చేసే ఇబ్బంది లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక.

  • వాలిడిటీ: 365 రోజులు (ఒక సంవత్సరం).
  • డేటా: ప్రతిరోజూ 2.5జీబీ హై-స్పీడ్ డేటా.
  • కాలింగ్: దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్.
  • ఎస్ఎంఎస్‌లు: రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు.
  • 5G ఆఫర్: అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా సౌకర్యం.
Jio announces free unlimited data offer for all users | Communications Today

గూగుల్ జెమిని ప్రో, అదనపు ప్రయోజనాలు

ఏఐ ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఆఫర్ చేస్తోంది. 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా క్రికెట్ మ్యాచ్‌లు, లేటెస్టు సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.