📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Smart Phone జపాన్ లో స్మార్ట్ ఫోన్ వాడకం రోజుకు 2గంటలే.. కొత్త ప్రతిపాదనలు

Author Icon By Vanipushpa
Updated: August 28, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్‌(Japan)లోని ఓ పట్టణం స్మార్ట్ ఫోన్ (Smart Phone) వినియోగంపై పరిమితి విధించాలని భావిస్తోంది. పట్టణంలోని 69వేల మంది ప్రతిరోజు రెండుగంటలు మాత్రమే స్మార్ట్ ఫోన్ వినియోగించాలనే ప్రతిపాదన చేసింది. ఈ చర్య స్మార్ట్ ఫోన్ వ్యసనంపై తీవ్ర చర్చకు దారితీసింది. జపాన్‌లో ఈతరహా ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి. ఈ వారంలో ఐచి ప్రాంతంలోని టయోకే (Toyoke) పట్టణ అధికారులు ఈ ప్రతిపాదనను సమర్పించగా, ప్రస్తుతం చట్టసభ సభ్యుల మధ్య చర్చ జరుగుతోంది. విద్య, పని ప్రదేశాలకు బయట మాత్రమే వర్తించే ఈ ప్రతిపాదనను కఠినంగా అమలుచేయబోమని టయోకే మేయర్ మసాఫూమి కోకి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని తగ్గించేలా ప్రోత్సహించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని వెల్లడించారు.
అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే అవకాశం
ఒకవేళ చట్టసభ సభ్యుల ఆమోదం పొందితే అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే ఈ నియమాన్ని… ఎవరైనా ఉల్లంఘించినా ఎటువంటి జరిమానాలు ఉండవు. ”రెండు గంటల పరిమితి అనేది పౌరులను ప్రోత్సహించడానికి ఒక నిబంధన మాత్రమే” అని మేయర్ మసాఫూమి కోకిపేర్కొన్నారు. దీని అర్థం పౌరుల హక్కులను పరిమితం చేయడమో, బాధ్యతలను మోపడమో కాదని, బదులుగా ప్రతి కుటుంబం స్మార్ట్ ఫోన్లతో గడిపే సమయం, ఆ పరికరాలను ఉపయోగించే రోజువారీ సమయం గురించి చర్చించడానికి ఒక అవకాశం మాత్రమేనన్నారు.

జపాన్ లో స్మార్ట్ ఫోన్ వాడకం రోజుకు 2గంటలే.. కొత్త ప్రతిపాదనలు

ఫోన్ లేకుండా స్కూల్‌కు వెళ్లడం మానేస్తున్నారు

వంట చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు వీడియోలు చూడటం, ఆన్‌లైన్‌లో కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇ-స్పోర్ట్స్ కోసం తర్ఫీదు పొందడం వంటివి రెండు గంటల పరిమితిలోకి తీసుకోరని వెల్లడించారు. ”రోజువారీ జీవితంలో ఉపయోగకరమైనవి, అనివార్యమైనవి” గా స్మార్ట్‌ఫోన్లను తాను గుర్తించానని కోకి చెప్పారు. కానీ కొంతమంది విద్యార్థులు ఫోన్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారని, స్కూల్‌కు వెళ్లడం మానేస్తున్నారని అన్నారు.
పెద్దలు కూడా కుటుంబంతో గడపలేకపోతున్నారు
పెద్దలు కూడా తమ ఫోన్లు, ట్యాబ్‌లను స్క్రోల్ చేస్తూ నిద్రను తగ్గించుకోవడం, కుటుంబంతో తగినంత సమయాన్ని గడపకపోవడం చేస్తున్నారని చెప్పారు. జపాన్ వార్తాసంస్థ మైనిచి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రతిపాదనపై 120మంది తమ అభిప్రాయాలను ఫోన్, ఈమెయిల్ ద్వారా అధికారవర్గానికి వెల్లడించారు. వీరిలో అత్యధిక మంది (80 శాతం) ఈ ప్రతిపాదన పట్ల అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఈ బిల్లుకు మద్దతు పలికారు. ఈ ప్రతిపాదనపై పలువురు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారని, ఓ యూజర్ ”రెండు గంటల్లో కనీసం ఒక పుస్తకం చదవలేరు. ఒక సినిమా చూడలేరు” అని రాశారని జపాన్ టైమ్స్ రాసింది.

మొదటి స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అయింది?
చరిత్రలో ఈరోజు: మొదటి స్మార్ట్‌ఫోన్, IBM సైమన్, నవంబర్ 23, 1992న లాంచ్ చేయబడింది
మొదటి స్మార్ట్‌ఫోన్ IBM సైమన్ పర్సనల్ కమ్యూనికేషన్, ఇది నవంబర్ 1992లో ప్రకటించబడింది మరియు 1994లో వినియోగదారులకు విడుదల చేయబడింది.

స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడు ప్రాచుర్యం పొందాయి?
2000ల చివరిలో ఐఫోన్ మరియు Samsung Galaxy S వంటి ప్రత్యర్థి పరికరాల ప్రజాదరణ ఆధారంగా 2010ల ప్రారంభం నుండి మధ్యకాలం వరకు స్మార్ట్‌ఫోన్‌లు నిజంగా ప్రజాదరణ పొందాయి. హార్డ్‌వేర్, సెల్యులార్ నెట్‌వర్క్‌లు (ముఖ్యంగా 3G)లో పురోగతి మరియు యాప్ స్టోర్‌లు మరియు సోషల్ మీడియా పెరుగుదల, స్మార్ట్‌ఫోన్‌లను వేగంగా స్వీకరించడానికి ఆజ్యం పోశాయి మరియు వాటిని రోజువారీ జీవితంలో సర్వవ్యాప్త భాగంగా మార్చాయి.

Digital Policy Government Proposal japan Latest News Breaking News Screen Time Limit Smartphone Usage Technology Rules Telugu News Youth Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.