📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

జాగెల్ ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్ థింక్ గ్యాస్ విడుదల

Author Icon By sumalatha chinthakayala
Updated: January 8, 2025 • 10:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మరియు అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్‌ను AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham)-థింక్ గ్యాస్ విడుదల చేసింది. ఈ కార్డును మల్టీ-సిటీ లైవ్ ఈవెంట్‌లో సీనియర్ నాయకత్వం సమక్షంలో AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham)-థింక్ గ్యాస్, చైర్మన్ శ్రీ అమితవ సేన్‌గుప్తా విడుదల చేశారు.

అత్యుత్తమ శ్రేణి భదత్రా ఫీచర్‌లతో సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ఈ వినూత్న కార్డ్‌తో, కస్టమర్‌లు ఆస్వాదించవచ్చు. ఈ కార్డ్ ఇంధన, సురక్షితమైన & సౌకర్యవంతమైన నగదు రహిత చెల్లింపుల కోసం రీడీమ్ చేయదగిన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది, ఒకే మాస్టర్ ఖాతాను ఉపయోగించి తమ మొత్తం ఫ్లీట్‌ను పర్యవేక్షించడానికి నిర్వాహకులకు వీలు కల్పిస్తుంది.

image

కార్డు ఆవిష్కరణ సందర్భంగా AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham)- థింక్ గ్యాస్ చైర్మన్ శ్రీ అమితవ సేన్‌గుప్తా మాట్లాడుతూ.. “మైలేజ్+ ఫ్యూయల్ కార్డ్ అనేది మా స్టేషన్‌లలో కస్టమర్ అనుభవాన్ని పునర్నిర్వచించే విప్లవాత్మక ఆవిషరణ. ఈ ఆవిష్కరణ స్వచ్ఛమైన , మరింత స్థిరమైన మరియు వినియోగదారు కేంద్రీకృత ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్డ్ మా పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది” అని అన్నారు.

జాగెల్ యొక్క ఎండి & సీఈఓ , శ్రీ అవినాష్ గోడ్ఖిండి మాట్లాడుతూ..” AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham) తో ఈ సహకారం రవాణా రంగంలో అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. గ్రామీణ భారతదేశంలోని ఫ్లీట్ యజమానులు మరియు ట్రక్ ఆపరేటర్ల మార్కెట్‌కు సేవ చేయడమే లక్ష్యంగా ఉంది..” అని అన్నారు.

AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham) మరియు థింక్ గ్యాస్ యొక్క MD మరియు CEO శ్రీ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ, “మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్ అనేది మా కస్టమర్‌లు మరియు వారి రీఫ్యూయలింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ప్రత్యేకమైన కార్డ్. ఈ కార్డ్ AG&P ప్రథమ్-థింక్ గ్యాస్ స్టేషన్‌లలో కరెన్సీగా మారుతుంది మరియు మా కస్టమర్‌లు వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది…” అని అన్నారు. AG&P ప్రథమ్-థింక్ గ్యాస్ తన స్టేషన్‌లలో మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్‌ని ఉపయోగించి చేసిన CNG కొనుగోళ్లపై రూ. 3/kg వరకు గణనీయమైన పొదుపును అందిస్తోంది.

AG&P first company Mileage+ Fuel card Think gas Zaggle

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.