📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: IT – నేడే ఐటిఆర్ కి లాస్ట్..పూర్తి చేయకపోతే రూ. 5వేలు జరిమానా

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ఫైల్ చేయడానికి చివరి తేదీ నేటితో ముగియనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ తేదీ తర్వాత మరింత గడువును పొడిగించేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో ఐటిఆర్ (ITR) ఫైలింగ్ డెడ్లైన్ ఈనెల 30 వరకు పొడిగించబడినట్లుగా వార్తలు చెక్కర్లు కొట్టాయి. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ గా కేంద్రం తేల్చిచెప్పింది. ఇలాంటి నకిలీ సమాచారాన్ని విని మోసపోవద్దని కూడా ఐటిశాఖ హెచ్చరించింది.

ఆరుకోట్లకు పైగా అందుకున్న ఐటిఆర్

ఇండియన్ ఆదాయపు పన్నుశాఖ (Indian Income Tax Department) 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి ఇప్పటివరకు 6కోట్లకు పైగా ఐటిఆర్ అందుకున్నట్లు ఆ శాఖ పేర్కొంది. ఈసారి కూడా ఐటిఆర్ ఫైల్,చేయనివారు పెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాగా ఈసారి ఆదాయపు పన్నుశాఖ జులై 31 నుండి సెప్టెంబరు 15వరకు ఐటిఆర్ ఫైలింగ్ డెడ్లైన్ ను పొడిగించిన విషయం విధితమే. దీనివెనుక కారణం ఐటిఆర్ ఫారమ్లలో కొన్ని మార్పులు, సాఫ్ట్వేర్ అప్డేట్లు, వినియోగదారులకు సులభతరం చేయడం. పొడిగింపు అవకాశం లేనందున చివరి నిమిషానికి వెయిట్ చేస్తే పోర్టల్ (Portal) లో స్లోడౌన్ లేదా హ్యాంగ్ అయ్యే అవకాశమున్నది. అందుకే ఇప్పుడే ఫైల్ చేయడం మంచిదని అంటున్నారు.

ఐటిఆర్ ఈ డాక్యుమెంట్స్:

IT

ఐటిఆర్ ను ఫైల్ చేయడం చాలా ముఖ్యమని

సెప్టెంబర్ 15 తరువాత ఐటిఆర్ ఫైల్ చేస్తే, అదనంగా పెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది మీపై ఆర్థిక భారంగా మారొచ్చు. అందుకే ఈరోజే మీ ఐటిఆర్ ను ఫైల్ చేయడం చాలా ముఖ్యమని ఐటిఆర్ డిపార్ట్మెంట్ (ITR Department) వారు హెచ్చరిస్తున్నారు. పైగా ఈ సంవత్సరపు ఐటిఆర్ ఎఫైలింగ్ డెడ్లైన్ గురించి స్పష్టత కోసం ఆదాయం పన్నుశాఖ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 15, 2025 తర్వాత పొడిగింపు లేదని స్పష్టం చేసింది.

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటిఆర్)ను గడువు తేదీ తరువాత దాఖలు చేస్తే పెనాల్టీ (జరిమానా), వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుంది. 2025-26 అసెస్మెంట్ ఇయర్ కు ఐటిఆర్ ను సెప్టెంబర్ 15, 2025 వరకు తప్పకుండా ఫైల్ చేయాలి. గడువు తేదీకి తర్వాత ఫైల్ చేస్తే, ఆయా కఠిన నిబంధనలు వర్తిస్తాయి. మీ మొత్తం ఆదాయం రూ.5లక్షల కంటే తక్కువ ఉంటే, అధికంగా రూ 1,000 జరిమానావిధించబడుతుంది. ఆదాయం రూ.5 లక్షలకు ఎక్కువ ఉంటే రూ.5000 వరకు జరిమానా అమలవుతుంది. ఇక సెక్షన్ 234ఎ ప్రకారం ట్యాక్స్ అండర్పేమెంట్ కి వడ్డీ అమలవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mono-train-a-mono-train-stopped-midway-due-to-a-technical-fault/national/547679/

Breaking News income tax department clarification income tax return ITR filing deadline last date ends today latest news no extension of deadline Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.