📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

ఇండియాలో ఇసుజు మోటార్స్ 4 కొత్త టచ్ పాయింట్స్..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 29, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చెన్నై: ఇసుజు మోటార్స్ లిమిటెడ్,జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశవ్యాప్తంగా నాలుగు కొత్త టచ్ పాయింట్స్ ప్రారంభముతో భారతదేశములో తన ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. ఇందులో ఖమ్మం, తెలంగాణ మరియు రత్నగిరి, మహారాష్ట్రాలలో రెండు కొత్త అధీక్రిత సేవా కేంద్రాలు (ఏఎస్‎సిలు) తో సహా ఇండోర్, మధ్యప్రదేశ్ మరియు పాట్నా, బీహార్ లలో కొత్త 3S (సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్) డీలర్షిప్ ఉన్నాయి.

ఈ కొత్త చేరికలతో, ఇసుజు యొక్క నెట్వర్క్ భారతదేశవ్యాప్తంగా 72 ప్రదేశాలకు పెరిగింది. ఇది మా వినియోగదారులకు దగ్గరగా ఉండడము, వినియోగదారు సంతృప్తి మరియు నిరంతరాయ యాజమాన్య అనుభవము కొరకు మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తుంది.

ఇండోర్ కొరకు ఇసుజు మోటార్స్ సాగర్ ఇసుజుతో మరియు బీహార్ కొరకు ఇంపీరియల్ ఇసుజుతో చేతులు కలిపింది. ఇది బీహార్ లోకి ఇసుజు విస్తరణను సూచిస్తుంది. మా సేవలను మరియు వినియోగదారులతో సంబంధాలను పెంచుకొనుటకు, కంపెనీ ఖమ్మం, తెలంగాణ మరియు రత్నగిరి, మహారాష్ట్రలో కొత్త ఏఎస్‎సిలను ప్రారంభించింది. బియాండ్ ఆటో కేర్ చే ఖమ్మం ఏఎస్‎సి మరియు ష్రైన్ ఇసుజు ద్వారా రత్నగిరి ఏఎస్‎సి నిర్వహించబడతాయి. ష్రైన్ ఇసుజు కొల్హాపూర్ లో 3S సదుపాయాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ సదుపాయాలు ఇసుజు యొక్క డీలర్షిప్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి మరియు అసాధారణ వినియోగదారు అనుభవాలను అందించుటకు సిబ్బంది అందరికి ఇసుజు నిపుణులచే శిక్షణ ఇవ్వబడుతుంది.

నెట్వర్క్ విస్తరణ గురించి రాజేష్ మిట్టల్, ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, మాట్లాడుతూ.. “మా నిరంతర నెట్వర్క్ విస్తరణ ఇసుజు యొక్క బ్రాండ్ పురోగతిని ప్రతిబింబిస్తుంది మరియు ఒక భిన్నమైన అనుభవాన్ని అందిస్తూ మా వినియోగదారులకు దగ్గరగా ఉండాలనే మా నిబద్ధతను నొక్కి చెప్తుంది. ఈ డీలర్షిప్స్ మరియు సేవా కేంద్రాల చేర్పుతో, దేశవ్యాప్తంగా ఇసుజు వాహనాల కొరకు పెరుగుతున్న డిమాండ్ ను నెరవేర్చుటకు మేము సిద్ధంగా ఉన్నాము ” అన్నారు.

తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా మాట్లాడుతూ.., “ఇసుజు వద్ద, మేము వినియోగదారుల యాజమాన్య ప్రయాణములో వినియోగదారుడికి ప్రాధాన్యతను ఇస్తాము. ఈ కొత్త సదుపాయాలు నిరంతరాయ, వ్యక్తిగతీకరించబడిన అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని అందించాలనే మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తాయి. మేము యాజమాన్య ప్రయాణాన్ని పెంచుటకు పాటుపడుతున్నాము. ఇసుజు ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళుటకు తమ ప్రయత్నాలతో మా కొత్త డీలర్స్ కొరకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ” అన్నారు.

4 new touch points expands footprint Google news india Isuzu Motors India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.