📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

IPL 2025: ఐపీఎల్ 2025 గూగుల్ డూడుల్ చూశారా?

Author Icon By Sharanya
Updated: March 22, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ‌రికొన్ని గంట‌ల్లోనే క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే ఈ మెగా టోర్నమెంట్‌ మొద‌లుకానున్న వేళ, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

గూగుల్‌ క్రికెట్‌ డూడుల్‌: ఆక‌ట్టుకునే విజువ‌ల్

గూగుల్‌ డూడుల్‌ను ఓ క్రికెట్‌ పిచ్‌ లా డిజైన్ చేసి, అందులో రెండు డక్స్‌ క్రికెట్‌ ఆడుతున్నట్లుగా చూపించింది. ఇందులో బ్యాటర్‌ బంతిని బ‌లంగా కొట్ట‌డం, అంపైర్‌ తన చేతిని పైకి ఎత్తి నాలుగు పరుగులు ఇవ్వ‌డం లాంటి అద్భుత దృశ్యాలు ఉన్నాయి. డూడుల్‌పై క్లిక్‌ చేస్తే, ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌లు, జట్ల వివరాలు, మ్యాచ్‌ సమయాలు, లైవ్‌ అప్‌డేట్స్‌ తదితర ముఖ్యమైన సమాచారాన్ని అందించనుంది. ఈరోజు నుంచి మొదలుకానున్న 18వ ఐపీఎల్ సీజన్ రెండు నెల‌ల పాటు అభిమానులను అలరించ‌నుంది. మే 25న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ క్రికెట్ ఉత్సవం ముగియ‌నుంది. ఈ సారి ఐపీఎల్‌లో మరింత పోటీ పెరిగేలా కనిపిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా కదిలేలా సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో తలపడనున్న‌ కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ సారి ఐపీఎల్‌లో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. కొత్త ఆటగాళ్లు, భారీ వేలంపాటలో కైవసం చేసుకున్న స్టార్ ప్లేయర్లు, జట్ల మార్పులు ఇవి అన్నీ అభిమానుల ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా యువ క్రికెటర్లు, కొత్త కెప్టెన్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సారి ఐపీఎల్ కోసం గూగుల్‌, యూట్యూబ్‌ సహా అనేక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేక ఫీచర్లను అందిస్తున్నాయి. యూజర్లు మ్యాచ్‌ల‌ లైవ్‌ స్కోర్‌లను సులభంగా తెలుసుకోవడంతో పాటు, తమ అభిమాన జట్ల గురించి ప్రత్యేక సమాచారం పొందేలా గూగుల్‌ మరిన్ని ఫీచర్లను తీసుకురాబోతోంది. మొత్తంగా, క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ 2025 మరోసారి అదిరిపోయే వినోదాన్ని అందించనుంది.

#google #GoogleDoodle #IPL18thSeason #IPL2025 #KKRvsRCB #SportsNews Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.