IOCL: పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

Read Time:  1 min
IOCL: పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!
FONT SIZE
GET APP

ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లో ఇంధన సరఫరాపై పడుతుందనే ప్రచారంపై ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) స్పందించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వార్తలను సంస్థ కొట్టిపారేసింది.

Read Also :Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!

IOCL: Don't believe the rumors of no-stock boards at petrol pumps!
IOCL: Don’t believe the rumors of no-stock boards at petrol pumps!

నిల్వలు పుష్కలం

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు దిగుమతులు నిలిచిపోతాయని, తద్వారా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై IOCL స్పష్టతనిచ్చింది. “దేశవ్యాప్తంగా మా పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. దేశ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి” అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

యధావిధిగా సరఫరా

ఇంధన సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం లేదని, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. పుకార్లను నమ్మి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని, ఇంధన లభ్యతపై ఎలాంటి ఇబ్బందులు రావని భరోసా ఇచ్చింది. ఇతర చమురు కంపెనీలు కూడా సరఫరాను నిశితంగా గమనిస్తున్నాయని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.