కొత్త సంవత్సరం ప్రారంభంతో పెట్టుబడిదారులు స్థిరమైన రాబడిని అందించే మార్గాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ రిస్క్‌తో(Investment Tips) భద్రమైన ఆదాయం కోరుకునే వారు పీపీఎఫ్, ఆర్డీ, ఎఫ్‌డీ వంటి సంప్రదాయ పెట్టుబడులను పరిశీలించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Read also: New Plan: మరింత చవక ప్లాన్ తో ఎయిర్ టెల్
PPFకు 15 సంవత్సరాల లాక్-ఇన్ ఉండగా ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. RDలో 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉండి, 4.25 శాతం నుంచి 6.70 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. అలాగే FDలకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు గడువు ఉండి, 6.4 శాతం నుంచి 7.3 శాతం వరకు రాబడి లభించే అవకాశం ఉంది.
మరోవైపు, దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి ఆశించే(Investment Tips) పెట్టుబడిదారులకు SIP ఒక మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారినప్పటికీ, దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: