हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Intel: ఇంటెల్ లో భారీగా లేఆప్స్

Sharanya
Intel: ఇంటెల్ లో భారీగా లేఆప్స్

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం మళ్లీ ఊహించని దిశగా వెళ్లుతోంది. కోవిడ్ తర్వాత ప్రారంభమైన ఆర్థిక మాంద్యం ప్రభావాలు ఇంకా విడిపోలేదు. భారీగా ఉద్యోగ నియామకాలు చేసిన కంపెనీలు ఇప్పుడు ఆగమాగం చేస్తున్నాయి. గడచిన రెండు సంవత్సరాలుగా టెక్ దిగ్గజాలు తమ ఖర్చులను తగ్గించుకోవాలని ఉద్యోగులను వరుసగా తొలగిస్తున్నాయి. ఇందులో తాజా పేరుగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ (Intel) కూడా చేరింది.

జూలైలో లేఆఫ్స్‌కు ఇంటెల్ సన్నాహాలు

తాజా సమాచారం ప్రకారం, జూలై మధ్యలో ఉద్యోగాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించడానికి ఇంటెల్ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల కొత్తగా నియమితులైన CEO లిప్-బు టాన్ మొదటిసారిగా ఈ తొలగింపులను చేపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం?

ఇప్పటివరకు ఎంత మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు, ఎలాంటి విభాగాలపై ఇది ప్రభావం చూపుతుందన్న దానిపై స్పష్టత లేదు. ది ఒరెగానియన్/ఒరెగాన్‌లైవ్ కథనం ప్రకారం ఇంటెల్ కంపెనీ జూలై నెల మధ్యలో ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందని, ఈ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ తొలగింపులు ఎంతమంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయనే దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ఏయే ప్రాంతాల్లో ఉద్యోగ తొలగింపులు ఉంటాయనే దానిపై కూడా అధికారిక సమాచారం లేదు. అయితే తొలగింపులు మాత్రం జరుగుతాయని తెలుస్తోంది. కంపెనీ బలోపేతంలో భాగంగానే ఈ తొలగింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. కస్టమర్ల అవసరాలను తీర్చడమే మా లక్ష్యమని ఇంటెల్ కూడా ఓ బహిరంగ ప్రకటనలో తెలిపింది.

టెక్ రంగం సంక్షోభంలో – గణాంకాలు భయానకంగా

గత కొద్ది నెలల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. Layoffs.fyi గణాంకాల ప్రకారం.. 2025లో 61,220 మందికి పైగా టెక్ ఉద్యోగులు ఇప్పటికే తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీని ప్రభావం 130 ఇతర కంపెనీలలోని ఉద్యోగులపై కూడా పడింది.మే 13న మైక్రోసాఫ్ట్ దాదాపు 6 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. 2023 తర్వాత దాని అతిపెద్ద ఉద్యోగ తొలగింపులు ఇవి. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోనే దాదాపు 2,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

గూగుల్ కూడా అనేక విభాగాల్లో ముఖ్యంగా అలెక్సా, ఎకో స్మార్ట్ స్పీకర్లు, జూక్స్, కిండిల్ వంటి ప్రొడక్ట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. అటానమస్ వెహికల్ యూనిట్ జూక్స్ వంటి ఉత్పత్తులను పర్యవేక్షించే దాని డివైసెస్ అండ్ సర్వీసెస్ గ్రూప్‌లోని దాదాపు 100 ఉద్యోగాలను ఇంటికి సాగనంపింది గూగుల్.

Read also: ATMs: ఏటీఎంల్లో 73% పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870