📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Infosys: “ఎక్కువ పని వద్దు.. ఆరోగ్యం ముఖ్యం!”: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం

Author Icon By Shobha Rani
Updated: July 1, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగుల ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌(Work-life balance)కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత పనివేళలు ముగిసిన తర్వాత అదనంగా పని చేయవద్దని, ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తోంది. ఈ పరిణామం, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో చేసిన “వారానికి 70 గంటల పని” వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో ఐటీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
వ్యక్తిగత మెయిల్స్‌తో హెచ్చరికలు
ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2023 నవంబర్ నుంచి కంపెనీ హైబ్రిడ్ వర్క్(Hybrid work) మోడల్‌ను అమలు చేస్తోంది. దీని ప్రకారం, ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజుల పాటు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది ఉద్యోగులు అదనపు పని గంటలు, సరైన నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం వంటి కారణాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సంస్థ హెచ్‌ఆర్ (hR)విభాగం గుర్తించింది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని గమనించి, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది.
హైబ్రిడ్ మోడల్ – ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఇందులో భాగంగా, ఉద్యోగుల పనివేళలను నిశితంగా గమనిస్తోంది. వారంలో ఐదు రోజుల చొప్పున, రోజుకు సగటున 9.15 గంటలు పనిచేయాల్సి ఉండగా, అంతకు మించి ఎక్కువ సమయం పనిచేస్తున్న వారిని గుర్తిస్తున్నారు. ముఖ్యంగా రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు, వారు ఏ రోజు ఎన్ని గంటలు పనిచేశారో వివరిస్తూ వ్యక్తిగతంగా ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు. పనివేళలు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని, పని మధ్యలో విరామం తప్పనిసరి అని ఆ మెయిల్స్‌లో సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప, పని గంటల తర్వాత ఆఫీస్ పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
నారాయణమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం
కొంతకాలం క్రితం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్(Narayana Murthy), దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించి పెద్ద దుమారానికి తెరలేపారు. ఆయన అభిప్రాయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైనప్పటికీ, ఆయన తన మాటలను సమర్థించుకున్నారు. అంతేకాకుండా, 1986లో ప్రవేశపెట్టిన ఐదు రోజుల పని విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు తాను పూర్తిగా వ్యతిరేకినని కుండబద్దలు కొట్టారు.

Infosys: “ఎక్కువ పని వద్దు.. ఆరోగ్యం ముఖ్యం!”: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం

వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ ఇష్టం లేదు..
ఈ నేపథ్యంలో, ఇన్ఫోసిస్ యాజమాన్యం తమ ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్ఫోసిస్ తాజా నిర్ణయం ఐటీ పరిశ్రమలో వెల్‌బీయింగ్‌కు ప్రాముఖ్యత ఇచ్చే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఉద్యోగులు ఒత్తిడిలో కాకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది సరైన నిర్ణయమని వర్క్‌ప్లేస్ అనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Stock market: స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ప్రారంభం

Breaking News in Telugu employee wellness Infosys Google news Google News in Telugu Infosys health policy Infosys HR guidelines Infosys hybrid model Infosys work hours policy IT work culture India Latest News in Telugu Narayana Murthy 70 hours no overtime Infosys Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news work life balance in IT

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.