IndiGo Fuel Surcharge: మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) తన ప్రయాణికులపై అదనపు ‘ఫ్యూయల్ సర్‌చార్జ్’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 14 (శనివారం) అర్థరాత్రి 12:01 గంటల నుండి అమలులోకి రానున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి. దీనితో ప్రయాణికులపై భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఈ సర్‌చార్జ్ విధిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.
Read Also: Fairs: కాలుష్యరహితంగా జాతరలు జరగాలి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: