📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock Market: ప్రారంభంలోనే సూచీల వెనకడుగు

Author Icon By Shobha Rani
Updated: June 30, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 గంటల సమయంలో నిఫ్టీ (Nifty)31 పాయింట్లు తగ్గి 25,606 వద్ద, సెన్సెక్స్‌ (Sensex)135 పాయింట్లు పతనమై 83,923 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, జైడస్‌ వెల్‌నెస్‌, బీహెచ్‌ఈఎల్‌, జూపిటర్‌ లైఫ్‌లైన్‌ అత్యధిక లాభాల్లో ఉండగా.. జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా, కర్ణాటక బ్యాంక్‌, జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌, నారాయణ హృదయాలయ, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈ(BSE)లో టెక్‌, టెలికామ్‌ రంగ సూచీలు మినహా అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
లాభాల స్వీకరణ ప్రభావం
గత వారం సూచీలు 9 నెలల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు మందకొడిగా ట్రేడవుతున్నాయి. గాజా(Gaja)లో యుద్ధానికి కూడా ఈ వారం ట్రంప్‌ ముగింపు పలకొచ్చనే ప్రచారంతో పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలు చిగురించాయి.
రంగాల వారీగా మార్కెట్ పరిస్థితి
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా నష్టపోయింది. శుక్రవారం రూ.85.47 వద్ద ముగియగా.. సోమవారం అది 85.48 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన మార్కెట్‌ సూచీలు సానుకూలంగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఒక్క న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌జెడ్‌ఎక్స్ 50 మాత్రమే 0.12 శాతం నష్టాల్లో ఉంది.

Stock Market: ప్రారంభంలోనే సూచీల వెనకడుగు

చైనాకు చెందిన షాంఘై 0.2 (Shanghai), జపాన్‌ నిక్కీ (Japan Nikkei) 1.64, దక్షిణ కొరియా కోస్పీ 0.66, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ (Australia ASX) 0.46శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
గ్లోబల్ పరిస్థితులు & ప్రభావం
గాజాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగవుతాయనే అంచనాలతో మదుపుదారుల్లో నమ్మకం పెరుగుతోంది. శుక్రవారం రూపాయి విలువు ₹85.47 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ₹85.48 వద్ద ప్రారంభమైంది.

Read Also: Indigo Airlines : ఇండిగో విమానానికి ఇంజిన్ లో సమస్య

AsiaMarkets beginning Breaking News in Telugu Equit Google news Google News in Telugu IndianMarkets Indices lag at the investors Latest News in Telugu MarketUpdate Nifty Paper Telugu News Rupee sensex StockMarket Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.