15%-16% తగ్గే అవకాశం
గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా(India, America)ల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాల ప్రకారం ట్రంప్(Trump) టారిఫ్‌లు భారీగా దిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50శాతం ఉన్న టారిఫ్‌లు.. 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. భారత కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆశావహం వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్‌కు సంబంధించి నా దగ్గర సమాచారం లేదు కానీ రెండు , మూడు నెలల్లో అమెరికా, భారత్‌ల మధ్య అన్ని సమస్యలూ తీరే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని..దీనిపై అమెరికా, భారత్ ఒక ఒప్పందానికి వస్తాయని తెలుస్తోంది. ఇది కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న అదనపు 50 శాతం సంకాలు 25శాతానికి..ఆ తర్వాత ప్రతీకార సుంకాలు కూడా 25 శాతం నుంచి 10-15శాతానికి దిగి వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు.
Read Also: Trump: చైనా వస్తువులపై 155% సుంకాలు తప్పవ్: ట్రంప్
భారత్‌తో డీల్ కుదుర్చుకునే పనిలో..
అమెరికా, భారత్ వాణిజ్య చర్చల్లో చాలా రోజులుగా నలుగుతున్న వ్యవసాయ ఉత్పత్తు అంశం మీద ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రానున్నారని సమాచారం. అమెరికా పంటలైన మొక్కజొన్న, సోయాబీన్ ను భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను చైనా తగ్గించుకుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుకుతోంది. ఇందులో భాగంగా భారత్‌తో డీల్ కుదుర్చుకునే పనిలో పడింది. అదే విధంగా ట్రంప్ పదేపదే చెబుతున్నట్టు రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు విషయంలో ఇండియా కాస్త తగ్గే అవకాశం ఉదని అంటున్నారు. రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించేందుకు భారత్ అంగీకరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
2025లో అమెరికాకు భారతదేశం ఎగుమతి చేసే వస్తువులు ఏమిటి?
ఈ నివేదిక ప్రకారం, నాలుగు నెలల్లో అమెరికాకు ఎగుమతులు 37.5 శాతం తగ్గాయి, మే 2025లో USD 8.8 బిలియన్ల నుండి సెప్టెంబర్ 2025లో USD 5.5 బిలియన్లకు తగ్గాయి, ఇది సంవత్సరంలో అత్యంత తీవ్రమైన మరియు అత్యంత నిరంతర క్షీణతను సూచిస్తుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: