📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gold: ప్రపంచ ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14% భారతదేశానిదే..

Author Icon By Shobha Rani
Updated: June 23, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

25 వేల టన్నుల బంగారానికి ఒరిజినల్ కేరాఫ్ హమారా ఇండియా. ఎస్.. మన దేశంలోని ఇళ్లు, గుళ్లలో ఉండే పసిడి దాదాపు రెండున్న కోట్ల కిలోలు. దీని విలువ అక్షరాలా 200 లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ అంచనాల్లో ఇది 56 శాతం. పాకిస్తాన్ ఎకానమీ కంటే ఆరు రెట్లు ఎక్కువ. అంతే కాదు.. ప్రపంచంలోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం వాటా భారతదేశానిదే. ఈ లెక్కన గ్లోబల్‌‌‌‌గా అతిపెద్ద బంగారు కొండ మన ఇండియానే. ఇందులో ఐతే నో మోర్ డౌట్స్.
2020 తరువాత రాకెట్ వేగంతో..
2020 నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరిగి దాదాపు రెట్టింపయ్యాయి. ఏడాది కాలంగా ఐతే.. పుత్తడి ధర ముట్టుకుంటే భగ్గుమంటోంది. పదిగ్రాముల పసిడి ధర లక్షకు అటూఇటూ అనగానే మిడిల్ క్లాసోడి గుండెలు గుభేల్‌ మంటున్నాయి. దిగువ మధ్యతరగతి మనిషైతే బంగారం షాపుల వైపే చూడ్డం మానేశాడు. ఫంక్షన్లు, పార్టీలైతే తప్ప తులమో అరతులమో కొనుక్కుని సర్దుకుంటున్నాడు. అంతమాత్రం చేత.. మన దేశమేం గోల్డు విషయంలో గొడ్డుపోలేదు. ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నా కొనుగోళ్లు మాత్రం కోటలు దాటుతూనే ఉన్నాయి.
2023లో భారత్‌లో గోల్డ్ డిమాండ్: 782 టన్నులు
గత ఏడాది ఇండియాలో బంగారం డిమాండ్ ఏకంగా 782 టన్నులకు చేరింది. కరోనా ముందటి యావరేజ్ కంటే ఇది 15 శాతం ఎక్కువ. ఆర్నమెంట్‌ బంగారం డిమాండ్ కాస్త మందగించినా.. బంగారం కడ్డీలు, కాయిన్లలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. కస్టమ్స్ డ్యూటీ 15శాతం నుంచి 6శాతానికి తగ్గడంతో బంగారం రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లు ఘనంగా పెరిగాయి. కన్‌జ్యూమర్ల ఉత్సాహం ఇదే రేంజ్‌లో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో బంగారం డిమాండ్ 725 టన్నులకు చేరుతుందన్నది యూబీఎస్ అంచనా. 2026 తర్వాత నెమ్మదించినా గోల్డ్ డిమాండ్‌‌‌‌ 800 టన్నుల దగ్గర స్థిరపడే ఛాన్సుంది. సో.. ప్రస్తుతం ఇండియాలో దాచిన బంగారం 25 వేల టన్నులు. ఏటా సగటున 8 వేల టన్నులు యాడవుతుంటే.. మన దేశపు బంగారం నిల్వలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహలకే అందేలా లేదు.
UBS అంచనాలు
యూబీఎస్ అంచనా ప్రకారం.. ఇళ్లలో ఉన్న బంగారంలో 2 శాతం కంటే తక్కువ మాత్రమే తనఖా కోసం గృహస్థులు బైటికి తీస్తున్నారు. మిగతాదంతా బీరువాల్లోనో బంకర్లలోనో రహస్య భాండాగారాల్లోనో దాక్కునే ఉంది. అలా నక్కిన కనకాన్ని బైటికి తీసే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకులు, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు గోల్డు లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించినా లాభం లేకుండా పోతోంది. ఎందుకంటే… భారతీయులకు బంగారంతో ముడిబడ్డ అంత గట్టిది. మనోళ్లు బంగారాన్ని కేవలం

Gold: ప్రపంచ ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14% భారతదేశానిదే..

ఆస్తిగా కాదు.. ప్రతిష్టగా భావిస్తారు. పసిడి ఆభరణాలతో ఉండే ఎమోషనల్ అటాచ్‌‌‌‌మెంట్ కారణంగా దాన్ని అంత ఈజీగా తనఖా పెట్టరు.. తెగనమ్ముకోరు. బంగారాన్ని బంగారంగా ఉంచుకోడానికే ఇష్టపడతారు. ఇటువంటి భావోద్వేగాల వల్లే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివన్నీ పెద్దగా సక్సెస్ కావడం లేదు.
గోల్డ్ మానిటైజేషన్ – ఆవశ్యకతా? సాధ్యమా?
ఇండియాలో బంగారం నిల్వలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. దీన్ని సరిగ్గా లెక్కగట్టే మానిటైజేషన్ వ్యవస్థ మన దగ్గర లేదు. కానీ.. గత నిల్వలను, తాజా కొనుగోళ్లను కలుపుకుని వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మన పసిడి ఖజానా సైజును కాలిక్యులేట్ చేస్తూనే ఉంది. సో.. పాతిక వేల టన్నుల బంగారం పేరుకు మనోళ్లదే ఐనా.. అది పూర్తిగా వ్యక్తిగతం. దీన్ని జాతీయ సంపదగా చెప్పుకునే అవకాశమే లేదు. ఆ మాటకొస్తే 200 లక్షల కోట్ల విలువైన ఈ పసిడి భాండాగారం ఎందుకూ కొరగాని నిరర్ధక ఆస్తిగానే మిగిలిపోతోందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇంట్లో దాచిన బంగారం
ఇళ్లలో ఉన్న బంగారంలో కేవలం 2% లోపే తనఖాగా బయటకు వస్తోంది.
మిగతా 98% బీరువాల్లో, బంకర్లలో దాగి ఉంది.
బంగారం అంటే ఆస్తికంటే ఎక్కువగా భావోద్వేగం.

Read Also: Stock Market: మార్కెట్లపై అమెరికా వైమానిక దాడుల ప్రభావం

#telugu News Breaking News in Telugu GoldIndia GoldInvestments GoldPrices Google news Google News in Telugu India holds 14% of the world's IndiaGoldDemand Latest News in Telugu Paper Telugu News private gold reserves. PrivateGoldHoldings Telugu News online Telugu News Paper Telugu News Today Today news WorldGoldReserve

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.