India govt: ప్రస్తుత డిజిటల్ కాలంలోనూ నగదు లావాదేవీల వద్ద ఎదురవుతున్న చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సాధారణంగా ఏటీఎంలలో కేవలం రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే లభిస్తుంటాయి. అయితే ఇకపై చిన్న మొత్తాల్లో నగదు అవసరమైన వారు ఇబ్బంది పడకుండా రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను కూడా ఏటీఎంల ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
ప్రత్యేకంగా ఏటీఎంలను రీడిజైన్
అందుకోసం ప్రత్యేకంగా ఏటీఎం(ATM New Rules)లను రీడిజైన్ చేసి, తక్కువ కరెన్సీని కూడా అందించేలా మార్పులు చేయనున్నారు. తొలుత ముంబై నగరంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రారంభించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు వంటి అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: