📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

UPI-Based Bank: భారత్‌లో మొట్టమొదటి UPI ఆధారిత బ్యాంక్‌

Author Icon By Shobha Rani
Updated: July 4, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకునే వారు నేడు ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకునే టెక్నాలజీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఆన్‌లైన్‌ చెల్లింపుల పద్దతుల్లో సులభమైన మార్గాలు వచ్చాయి. దేశంలో యూపీఐ వ్యవస్థ ఎంతగానో విస్తరించింది. ప్రతి రోజు కోట్లాది రూపాయలు యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. దేశంలో యూపీఐ సేవలు (UPI-Based Bank) వచ్చిన తర్వాత మరింత సులభం అయిపోయింది. ఇక దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందించాలనే ఉద్దేశంతో స్లైస్ బ్యాంక్ యుపిఐ ఆధారిత క్రెడిట్ కార్డును విడుదల చేసింది. దీని ద్వారా భారతదేశంలో బ్యాంకింగ్ విధానాన్ని మార్చాలని భావిస్తోంది.
స్లైస్ + NESFB విలీనంతో విస్తరణ దిశగా
భారతదేశంలోనే మొట్టమొదటి యూపీఐతో పనిచేసే భౌతిక బ్యాంక్ శాఖను, ఎటిఎం ను ప్రారంభించింది. వేగంగా బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుఉంది. స్లైస్ సూపర్ కార్డ్ పేరుతో విడుదల చేసిన ఈ యూపీఐ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు సులభంగా క్రెడిట్ పొందవచ్చు. ఈ కంపెనీ ఇటీవలే NESFBతో విలీనం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలను (UPI-Based Bank) మరింత విస్తరించడంతో పాటు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది.
బెంగళూరులో మొదటి శాఖ
ఈ స్లైస్ బ్యాంక్ బెంగళూరులోని కోరమంగళలో సరికొత్త యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖ(UPI-Based Bank)ను ప్రారంభించింది. ఇది బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇప్పుడు డిజిటల్

భారత్‌లో మొట్టమొదటి UPI ఆధారిత బ్యాంక్‌

బ్యాంక్ శాఖకు వెళ్లి, వేగవంతమైన సేవలను పొందవచ్చని స్లైస్ బ్యాంక్ తెలిపింది. UPI ATM ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. డిపాజిట్ కూడా చేయవచ్చు. అంతే కాదండోయ్‌ దీని ద్వారా బ్యాంకు అకౌంట్‌ ఓపెన్ చేయడం, ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా ఈ యూపీఐ ఆధారిత బ్రాంచులో పొందే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది.
UPI ఆధారిత సూపర్ కార్డ్ – క్రెడిట్ సేవల్లో విప్లవం
వినియోగదారులు డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు భౌతికంగా కూడా బ్రాంచ్‌ను విజిట్ చేసి సేవలు పొందొచ్చు.
స్లైస్ సూపర్ కార్డ్ ద్వారా సాధారణ యుపిఐ లావాదేవీలకు పాటు క్రెడిట్ సేవలు కూడా లభిస్తాయి. ఇది ఒక యుపిఐ ప్లస్ క్రెడిట్ ఫీచర్ కలిగిన మల్టీ-యూజ్ కార్డ్. యాప్ ద్వారా ట్రాన్సాక్షన్లు, బిల్లు చెల్లింపులు, రివార్డ్ పాయింట్లు సులభంగా పొందవచ్చు.
టెక్నాలజీతో ముందుకు..
ఇండియాలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్, వేగవంతమైన బ్యాంకింగ్ అనుభవం అందించడం. ఏఐ ఆధారిత సేవలు, స్వయంచాలిత కస్టమర్ సపోర్ట్, మరియు కస్టమైజ్డ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అందించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Stock market: మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభం

Breaking News in Telugu digital banking India 2024 Google news India first UPI branch Latest News in Telugu Paper Telugu News Slice NESFB merger Slice Super Card Slice UPI bank Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news UPI ATM India UPI based bank India UPI credit card India UPI powered banking services

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.