📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Fintech: ఫిన్‌టెక్‌ పెట్టుబడుల్లో మూడో స్థానంలో భారత్..

Author Icon By Shobha Rani
Updated: July 5, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో భారత ఫిన్‌టెక్‌ (Fintech) రంగం 889 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,600 కోట్లు) సమీకరించిందని ఒక నివేదిక వెల్లడించింది. 2024 ద్వితీయార్ధంలో సమీకరించిన 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు 10,300 కోట్ల)తో పోలిస్తే ఇది 26% తక్కువ. 2024 ప్రథమార్ధంలో వచ్చిన 936 మి.డాలర్ల (రూ.8,000 కోట్ల)తో చూస్తే 5% తక్కువని వెల్లడించింది.
గ్లోబల్ ఫిన్‌టెక్‌ పెట్టుబడుల్లో భారత్‌..
ప్రపంచంలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్‌ (America, Britain)ఉన్నాయి. ‘నిధుల సమీకరణలో భారత ఫిన్‌టెక్‌ (Fintech) రంగం కొద్దిగా నెమ్మదించింది. ప్రారంభ స్థాయి పెట్టుబడులు స్థిరంగా ఉండటం, కొనుగోలు కార్యకలాపాల్లో వృద్ధితో పెట్టుబడిదార్ల ఆసక్తి బలంగా ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా వినూత్నత ఆధారిత మోడళ్లపై ఆశావహంగా ఉన్నారు’ అని ట్రాక్షన్‌ సహవ్యవస్థాపకులు నేహ సింగ్‌ (Neha Singh)వెల్లడించారు. ఫిన్‌టెక్‌ రంగంలో బెంగళూరు ఆధిపత్యం కొనసాగుతోందని, తద్వారా అంతర్జాతీయ ఫిన్‌టెక్‌లో భారత్‌ స్థానం బలంగా ఉందని తెలిపారు.

ఫిన్‌టెక్‌ రూ.7,600 కోట్లు సమీకరణ

విలీనం & కొనుగోలు లావాదేవీలు
ఫిన్‌టెక్‌ రంగ (Fintech) కంపెనీల్లో సీడ్‌ స్టేజ్, లేట్‌ స్టేజ్‌ పెట్టుబడులతో పోలిస్తే ప్రారంభ స్థాయి పెట్టుబడులు మెరుగ్గా ఉన్నాయి. సీడ్‌ స్టేజ్‌ స్టార్టప్‌లు 91.2 మి.డాలర్లు సమీకరించాయి. 2024 ద్వితీయార్ధం (126 మి.డాలర్ల)తో చూస్తే ఇవి 27% తక్కువ. 2024 ప్రథమార్ధంలో వచ్చిన 137 మి.డాలర్లతో పోలిస్తే 33% క్షీణించాయి. ప్రారంభ స్థాయి సంస్థలు మాత్రం 361 మి.డాలర్లు సమీకరించాయి. 2024 ద్వితీయార్ధంలో వచ్చిన 329 మి.డాలర్లతో చూస్తే 10% వృద్ధి నమోదైంది. 2024 ప్రథమార్ధంలో సమీకరించిన 9 శాతంతో పోలిస్తే 9% పెరిగాయి.
నగరాల వారీగా పెట్టుబడుల పంపిణీ
లేట్‌ స్టేజ్‌ సమీకరణ మాత్రం 437 మి.డాలర్లకు తగ్గాయి. 2024 ద్వితీయార్ధం (745 మి.డాలర్ల)తో పోలిస్తే 41%, 2024 ప్రథమార్ధం (467 మి.డాలర్ల)తో చూస్తే 6% చొప్పున క్షీణత కనిపించింది. 2025 ప్రథమార్ధంలో 16 కొనుగోళ్లు నమోదయ్యాయి. 2024 ప్రథమార్ధంలో 11 కొనుగోళ్లు ఉండగా, 2024 ద్వితీయార్ధంలో 17 కొనుగోళ్లు జరిగాయి. ఫిస్‌డమ్‌ను గ్రో 150 మి.డాలర్లకు కొనుగోలు చేయడం అతిపెద్ద లావాదేవీగా ఉంది. స్టాకోను ఇన్‌క్రెడ్‌ మనీ 35 మి.డాలర్లకు దక్కించుకుంది. మొత్తం నిధుల సమీకరణలో బెంగళూరు వాటా 55 శాతంగా ఉంది. ముంబయి 14 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: SEBI bans Jane Street: అమెరికా సంస్థ జేన్‌ స్ట్రీట్‌పై సెబీ నిషేధం

Bangalore fintech growth Breaking News in Telugu fintech funding trends India fintech innovation India fintech M&A India global fintech rankings 2025 Google news Grow Fisdom acquisition InCred Stocxo deal India fintech investment 2025 Indian fintech funding H1 2025 Indian fintech startups 2025 late stage investment fintech India Latest News in Telugu Mumbai fintech market share Neha Singh Traxcn Paper Telugu News seed stage fintech funding India Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Traxcn fintech report

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.