📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ పై యుద్ధ ప్రభావం

Author Icon By Shobha Rani
Updated: June 23, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పోరులో అమెరికా జోక్యం చేసుకోవడంతో పాటు అక్కడి అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చమురు ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందన్న భయాలు కూడా ఇందుకు తోడయ్యాయి.
సూచీల రాకపోకలు
ఐటీ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం భౌగోళిక ఉద్రిక్తతలను తట్టుకుని నిలబడడం విశేషం. ఇంట్రాడేలో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు.. ఆఖర్లో కాస్త కోలుకున్నాయి. ఓ దశలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌ చివరికి 500 పాయింట్ల నష్టంతో గట్టెక్కింది. నిఫ్టీ మళ్లీ 25 వేల దిగువన ముగిసింది.
రంగాలవారీగా ప్రభావం
సెన్సెక్స్‌ ఉదయం 81,704.07 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,408.17) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో (Sensex) 81,476.76 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీ.. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకుంది. చివరికి సెన్సెక్స్‌ (Sensex) 511.38 పాయింట్ల నష్టంతో 81,896.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 140.50 పాయింట్ల నష్టంతో 24,971.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.76గా ఉంది.

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ పై యుద్ధ ప్రభావం

సెన్సెక్స్‌ (Sensex) 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ప్రధానంగా నష్టపోయాయి. ట్రెంట్‌, బీఈఎల్‌ బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.35 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3,381 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సమగ్ర దృక్కోణం
ఈ పరిణామాలన్నింటిలోనూ ప్రధాన అంశం జియోపాలిటికల్ అస్థిరత. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా ట్రయాంగిల్ అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా భారత మార్కెట్లు కూడా స్పష్టంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం, చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ పెట్టుబడిదారుల వైఖరి తదితర అంశాలు మార్కెట్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్నాయి.

Read Also: Swiss bank: స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన డిపాజిట్లు!

Breaking News in Telugu GeopoliticalTensions Google news Google News in Telugu Impact of war on domestic IsraelIranConflict Latest News in Telugu NiftyBelow25K OilPrices Paper Telugu News sensex stock market StockMarketCrash Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.