హ్యుందాయ్ మోటార్ (Hyundai Cars) ఇండియా లిమిటెడ్ కొత్త సంవత్సర ఆరంభంలోనే కారు కొనుగోలుదారులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల ధరలను సగటున 0.6 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ (Hyundai Cars) అధికారికంగా ప్రకటించింది.విలువైన లోహాలు, ఇతర కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు అధికమవడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది.
Read Also: Nitish Kumar : తన ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం
తప్పని పరిస్థితి
క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, గ్రాండ్ i10 నియోస్, ఆల్కాజార్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ఈ పెంపు ప్రభావం చూపనుంది. రెనాల్ట్, JSW MG మోటార్, Mercedes-Benz, హోండా, నిస్సాన్, BYD వంటి ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచనున్నాయి. వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రయత్నించామని కంపెనీ వివరణ ఇచ్చింది. కానీ, క్రమంగా పెరుగుతున్న ఖర్చులలో కొంత భాగం బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని,
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం హ్యూండాయ్ మోటార్ కంపెనీ హ్యాచ్బ్యాక్ ఐ10 మోడల్తో పాటు ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ఎస్యూవీ మోడల్ ఐయోనిక్ 5 వరకు అనేక కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 5.47 లక్షల నుంచి రూ. 47 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: