📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Sreeja Varma: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‍(Hyderabad)కు చెందిన విద్యార్థిని శ్రీజ వర్మ(Sreeja Varma) దుర్మరణం చెందింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆమె తన అపార్ట్‌మెంట్ నుంచి భోజనం కోసం కారులో రెస్టారెంటుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్నేహితురాలు కూడా కారులో ఉన్నట్లు సమాచారం. శ్రీజ వర్మ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పని చేస్తుండగా..

సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజ వర్మ, శ్రేయ వర్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. వారు మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పని చేస్తుండగా, ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు శ్రేయా వర్మ కూడా ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లింది.

ట్రాఫిక్ ఘర్షణలు

ట్రాఫిక్ ఘర్షణలు తరచుగా గాయం , వైకల్యం , మరణం మరియు ఆస్తి నష్టంతో పాటు సమాజానికి మరియు వ్యక్తులకు ఆర్థిక ఖర్చులకు దారితీస్తాయి. రోడ్డు రవాణా అనేది గణాంకపరంగా ప్రజలు రోజువారీగా..

Read hindi news:hindi.vaartha.com

Read also:

Hyderabad student Indian student death Latest News Breaking News overseas news Road Accident Telugu News Tragic Incident US accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.