📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Google Maps : గూగుల్‌కు ట్రాఫిక్ ఉందని ఎలా తెలుసు..?

Author Icon By Ramesh
Updated: September 13, 2026 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Google Maps : రోడ్డుపై ట్రాఫిక్ ఎంత ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తేనే తెలుసుకుంటాం. కానీ గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) మనం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్‌ ఎలా ఉందో క్షణాల్లో ఎలా చెప్పగలుగుతుంది? మ్యాప్స్‌లో రోడ్డుపై కనిపించే గ్రీన్, ఎల్లో, రెడ్ లైన్లు వెనుక భారీ స్థాయిలో డేటా, మెషిన్ లెర్నింగ్, రియల్‌టైమ్ సమాచారం పనిచేస్తుంటాయి.

Read Also : షాలిమార్ ధనియాల పొడిపై FSSAI చర్యలు..!

గూగుల్‌ మ్యాప్స్‌ ప్రధానంగా రోడ్డుపై ప్రయాణిస్తున్న స్మార్ట్‌ఫోన్ల :

గూగుల్‌ మ్యాప్స్‌ ప్రధానంగా రోడ్డుపై ప్రయాణిస్తున్న స్మార్ట్‌ఫోన్ల నుంచి లభించే లొకేషన్, వేగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఒక రోడ్డుపై సాధారణంగా వాహనాలు వేగంగా కదులుతున్నప్పుడు, ఆ మార్గంలో ట్రాఫిక్‌ తక్కువగా ఉందని సిస్టమ్‌ అంచనా వేస్తుంది. అదే సమయంలో అనేక వాహనాల వేగం ఒక్కసారిగా తగ్గితే.. అక్కడ ట్రాఫిక్‌ పెరిగిందని గుర్తించే అవకాశం ఉంటుంది. Google ఈ సమాచారాన్ని ఇతర డేటాతో కలిపి ట్రాఫిక్‌ పరిస్థితిని అంచనా వేస్తుంది. అందుకే మ్యాప్స్‌లో సాధారణంగా గ్రీన్ కలర్‌ అంటే ట్రాఫిక్‌ సాఫీగా ఉందని, ఎల్లో/ఆరెంజ్‌ అంటే రాకపోకలు నెమ్మదించాయని, రెడ్‌ అంటే ఎక్కువ రద్దీ ఉందని సూచిస్తుంది. ట్రాఫిక్‌ లేయర్‌ ద్వారా రోడ్లపై ప్రస్తుత పరిస్థితిని చూడొచ్చు.

ఇక్కడితో పని పూర్తికాదు. గూగుల్‌ గతంలో అదే రోడ్డుపై ఏ సమయానికి ఎంత ట్రాఫిక్‌ ఉంటుందో తెలిపే హిస్టారికల్ ట్రాఫిక్ ప్యాటర్న్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు.. ప్రతిరోజూ ఉదయం 9 గంటల సమయంలో ఒక రోడ్డుపై రద్దీ పెరుగుతుంటే, ఆ నమూనాను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ట్రాఫిక్‌ను కూడా అంచనా వేయగలదు. ఈ ప్రిడిక్షన్‌లను రూట్‌ సూచించడంలోనూ ఉపయోగిస్తుంది. అంతేకాదు.. ప్రమాదాలు, రోడ్డు మూసివేతలు, నిర్మాణ పనులు వంటి ఘటనలపై డ్రైవర్ల నుంచి వచ్చే రిపోర్టులు, స్థానిక ప్రభుత్వాలు లేదా ఇతర అధికారిక వనరుల సమాచారం కూడా ఉపయోగపడుతుంది. దీంతో అకస్మాత్తుగా ఏర్పడిన ట్రాఫిక్‌ పరిస్థితులను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించగలుగుతుంది.

అయితే మ్యాప్స్‌ చూపించే ట్రాఫిక్‌ సమాచారం ప్రతిచోటా ఒకే స్థాయిలో అందుబాటులో ఉండదు. డేటా లభ్యత, ప్రయాణించే వాహనాల సంఖ్య, స్థానిక పరిస్థితులపై ఖచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే మ్యాప్స్‌లో కనిపించే రంగులు వంద శాతం ఖచ్చితమైన కొలతలు కాకుండా, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా రూపొందించిన ట్రాఫిక్ అంచనాలు అని గుర్తుంచుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే.. మన ఫోన్‌లు, రోడ్లపై ప్రయాణించే ఇతర వాహనాల కదలికలు, పాత ట్రాఫిక్‌ నమూనాలు, ప్రమాదాలు-రోడ్డు పరిస్థితుల సమాచారం అన్నింటినీ కలిపి గూగుల్‌ మ్యాప్స్‌ “ఇక్కడ ట్రాఫిక్‌ ఉంది” అని మనకు చెప్పేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Breaking News in Telugu Google Google Maps Google Maps Traffic latest news Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today traffic Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.