ప్రముఖ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) తమ ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2026 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. వార్షిక ధర సవరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 మోడల్ ఇయర్ వాహనాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది, పాత స్టాక్ (2025 మోడల్స్) పాత ధరలకే అందుబాటులో ఉంటాయి. ఇన్‌పుట్ కాస్ట్‌లు, మెటీరియల్స్, లాజిస్టిక్స్, ఎనర్జీ ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమైందని కంపెనీ తెలిపింది. ఆటో నిపుణుల అంచనాల ప్రకారం ధరలు 1-2% వరకు పెరిగే అవకాశం ఉంది.
Read Also: Housing Scheme: స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి
స్టాక్ ను క్లియర్ చేయడానికి
నిజానికి ఏడాది మారె సమయంలో అనేక తయారీ సంస్థలు ఇదే విధంగా ధరలను పెంచడం సాధారణమే. హోండా (Honda Car) కార్ల ధరల పెంపుతో పాటు వాహనాల స్పెసిఫికేషన్లు లేదా ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవు. మరోవైపు 2025 స్టాక్ ను క్లియర్ చేయడానికి డీలర్షిప్ ల వద్ద పరిమిత డిస్కౌంట్లు ఇవ్వొచ్చని అంచనా.
కాబట్టి కొత్త హోండా కారు కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఈ ధరల పెంపు ప్రజాధారణ పొందిన హోండా అమేజ్, హోండా సిటీ, హోండా ఎలేవేట్, హోండా సిటీ హైబ్రిడ్ వంటి బడ్జెట్ కార్లపై ప్రభావితం చేయనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: