దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని మరింత విస్తరించే దిశగా పెద్ద అడుగు వేసింది. ఇప్పటికే “విడా” (Hero Vida) బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooters) ను మార్కెట్లో అందుబాటులో ఉంచిన ఈ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఈ దిశగా, హీరో సోమవారం “ప్రాజెక్ట్ VXZ” పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రేమికుల్లో మంచి చర్చనీయాంశంగా మారింది.
Read Also: Anil Ambani:రూ.3,084 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్..అనిల్ అంబానీకి భారీ దెబ్బ
ఇటలీలోని మిలాన్ నగరంలో నవంబర్ 6 నుంచి 9 వరకు జరగనున్న ప్రతిష్ఠాత్మక EICMA 2025 ఆటో ఎగ్జిబిషన్‌లో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను హీరో అధికారికంగా ప్రదర్శించనుంది. విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే, ఈ బైక్‌ను స్పోర్టీ డిజైన్‌తో తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. షార్ప్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, స్ప్లిట్ సీట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త
హెడ్‌ల్యాంప్ పక్కన ‘విడా’ (Hero Vida) అనే అర్థం వచ్చేలా ఎల్ఈడీ డీఆర్ఎల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయడం విశేషం.EICMA అనేది ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త మోడళ్లను ప్రదర్శించే అతిపెద్ద వేదిక. ఈ ఈవెంట్‌లో హీరోతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్ వంటి ఇతర భారతీయ కంపెనీలు కూడా తమ నూతన వాహనాలను ఆవిష్కరించనున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హీరో విడా నుంచి రాబోతున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై మార్కెట్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. బైక్‌కు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఇతర ఫీచర్ల పూర్తి వివరాలు ఆవిష్కరణ సందర్భంగా వెల్లడి కానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: