తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)ఇచ్చింది.
చెన్నై ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకారం.. నుంగంబాక్కం, అడయార్, రాజా అన్నామలైపురం, వడపళని సహా అనేక ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టు 23 వరకూ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నైలో అత్యధిక వర్షపాతం?
2005లో నమోదైన అత్యధిక వార్షిక వర్షపాతం 2,570 మి.మీ. చెన్నైలో మే చివరి నుండి సెప్టెంబర్ చివరి వరకు నైరుతి దిశగా మరియు మిగిలిన కాలంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తాయి.
చెన్నై భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే నగరం?
చెన్నై భారతదేశంలోని అత్యంత వేడిగా ఉండే నగరాల్లో ఒకటి , ముఖ్యంగా వేసవి నెలల్లో. ఉష్ణమండల వాతావరణానికి పేరుగాంచిన చెన్నై, ఏప్రిల్ నుండి జూన్ వరకు తరచుగా 40°C కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు కలిగి, తీవ్రమైన వేడి మరియు అధిక తేమను అనుభవిస్తుంది.
చెన్నైలో భారీ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి?
చెన్నై భారతదేశ తూర్పు తీరంలో ఉంది. సాధారణంగా, దక్షిణ భారతదేశం నైరుతి రుతుపవనాల నుండి వర్షపాతం పొందుతుంది. కానీ పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం నుండి వచ్చే ఈ నైరుతి రుతుపవనాలను అడ్డుకుంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: