హెచ్1-బీ వీసా(H1-B Visa) ఫీజును ట్రంప్ సర్కారు లక్ష డాలర్లకు పెంచడాన్ని నెట్‌ఫ్లిక్స్ సహవ్యవస్థాపకుడు రీడ్ హ్యాస్టింగ్స్ స్వాగతించారు. ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆయన ప్రశంసలు కురిపించాడు. విదేశీ వర్కర్లను జాబ్‌లోకి తీసుకుంటున్న కంపెనీలకు హెచ్1-బీ వీసా (H1-B Visa) ఫీజు పెంపుతో అందర్నీ షాక్‌లోకి నెట్టేశారు ట్రంప్. వివాదాస్పదంగా మారిన ఆ నిర్ణయంపై అనేక మంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ కోఫౌండర్ రీడ్ హాస్టింగ్స్ మాత్రం సుముఖత (Willingness)వ్యక్తం చేశారు.
హెచ్1-బీ రాజకీయాలపై 30 ఏళ్లు పనిచేశానని, హెచ్1-బీ వీసా (H1-B Visa)కోసం ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్లు వసూల్ చేయడం గొప్ప పరిష్కారమని ఆయన అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. హెచ్1-బీ వీసా ఫీజు పెంపు కేవలం హై వాల్యూ జాబ్‌లకే వర్తిస్తుందని అన్నారు. ఇక నుంచి వీసాల కోసం లాటరీలు అవసరం ఉండదని, ఉద్యోగాలకు కూడా ఢోకా ఉండదని ఆయన అన్నారు. ట్రంప్ వీసా ఫీజు పట్ల మద్దతు ప్రకటించిన హాస్టింగ్స్ ఆ నిర్ణయం అకస్మాత్తుగా జరిగిందన్నారు. వాస్తవానికి గతంలో ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హాస్టింగ్స్ వ్యతిరేకించేవారు.
హెచ్ 1 బి భారతీయులకు మాత్రమే ఉందా?
అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం H-1B వీసాల ద్వారా భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది, ఆమోదించబడిన లబ్ధిదారులలో 71% వాటా కలిగి ఉంది , చైనా 11.7%తో రెండవ స్థానంలో ఉంది.
హెచ్1బీ వీసా ఫీజు?
H-1B వీసా కార్యక్రమం ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి అధిక నైపుణ్యం కలిగిన కార్మికులకు $100,000 రుసుమును జోడించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు శుక్రవారం సంతకం చేశారు. అనేక పెద్ద కంపెనీలు వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను మరియు ఇతర అధిక-ప్రత్యేకత కలిగిన కార్మికులను నియమించుకోవడానికి ఉపయోగించిన కార్యక్రమానికి ఇది ఒక నిటారుగా మరియు నాటకీయమైన మార్పు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: