📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: GST: లక్షల కోట్ల ఆదాయం పొందిన జీఎస్టీ వసూళ్లు

Author Icon By Saritha
Updated: November 1, 2025 • 5:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పండగ సీజన్ ప్రభావం జీఎస్టీ ఆదాయం కొత్త గరిష్ఠం

దేశవ్యాప్తంగా పండుగల సందడి ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపించింది. అక్టోబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు కొత్త రికార్డును సృష్టించాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 4.6 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరింది. ఇది వరుసగా పదో నెల రూ. 1.8 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు జీఎస్టీ వసూళ్లు 9 శాతం పెరిగి రూ. 13.89 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 12.74 లక్షల కోట్లుగా ఉంది. రీఫండ్‌లను మినహాయిస్తే, అక్టోబర్‌లో నికర వసూళ్లు రూ. 1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Read also: పాపం అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ

GST: లక్షల కోట్ల ఆదాయం పొందిన జీఎస్టీ వసూళ్లు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లలోనూ బలమైన వృద్ధి సంకేతాలు

సెప్టెంబరులో జీఎస్టీ (GST) రేట్లను సరళీకరించడం, పండగ సీజన్‌లో వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ వృద్ధికి దారితీశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారులకు తగ్గింపుల ప్రయోజనం అందడంతో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో వినియోగం 10 శాతానికి పైగా పెరిగి, సుమారు రూ. 20 లక్షల కోట్ల మేర అదనపు వ్యయం జరిగే అవకాశం ఉందని అంచనా. కేపీఎంజీ ఇండియా భాగస్వామి అభిషేక్ జైన్ మాట్లాడుతూ, పండగ సీజన్‌లో పెరిగిన వినియోగం, పన్ను చెల్లింపుల్లో క్రమశిక్షణ, పారదర్శక విధానాలు ఇవన్నీ జీఎస్టీ వసూళ్లలో బలమైన వృద్ధికి దోహదపడ్డాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిర దిశలో సాగుతోందనే సూచన అని అన్నారు.

అదేవిధంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కూడా వృద్ధి కనిపిస్తోంది. అక్టోబర్ 12 నాటికి నికర ప్రత్యక్ష పన్నులు 6.33 శాతం పెరిగి రూ. 11.89 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్ పన్ను రూ. 5.02 లక్షల కోట్లు, వ్యక్తిగత పన్ను రూ. 6.56 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Abhishek Jain Corporate Tax Direct Taxes Economic Growth GST Collections India economy Latest News in Telugu Ministry of Finance Revenue Growth Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.