📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Google: ఏఐ జెమిని ప్యాక్ ఉచితమని గూగుల్ కీలక ప్రకటన

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ డిజిటల్ యుగం(Digital Period)లో చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు స్మార్ట్‌గా నేర్చుకోవడం, టెక్నాలజీని ఉపయోగించడం కూడా చాలా కీలకం. మీరు ప్రాజెక్టులు తయారు చేస్తున్నా సమయాల్లో, గూగుల్(Google) ప్రకటించిన జెమిని(Gemeni) ప్రీమియం ఆఫర్ విద్యార్థులకు ఓ వరం లాంటిదే! ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు విద్యలో ఓ భాగంగా మారిపోయింది. ఇదే సందర్భంలో, గూగుల్ ఇప్పుడు భారతదేశ విద్యార్థు(Indian Students)ల కోసం ఒక శ్రేష్ఠమైన ఆఫర్ ప్రకటించింది.
ఉచితంగా ఏడాది పాటు పొందే అవకాశం
ఇది చిన్న ఆఫర్ కాదు. మీరు ఒక విద్యార్థి అయితే, మీకు గూగుల్ నుంచి రూ. 19,500 విలువ చేసే జెమినై ప్రీమియం ప్యాకేజీను ఉచితంగా ఏడాది పాటు పొందే అవకాశం ఉంది. ఇది AI ప్రియులకే కాదు, రోజూ గూగుల్ యాప్స్ వాడే ప్రతి విద్యార్థికి సూపర్ గిఫ్ట్‌ అన్న మాట. దీనివల్ల విద్యార్థులు అధునాతన మల్టీమోడల్ జెమినై మోడల్స్, Gemini, Veo 3 టెక్స్ట్-టు-వీడియో జనరేటర్ మరియు మరిన్ని టూల్స్ ఉపయోగించవచ్చు.
Gemini 2.5 Pro మోడల్ ఆధారంగా పనిచేసే నూతన AI చాట్ బోట్, ఇప్పుడు విద్యార్థులకు వ్రాతపరమైన సహాయాన్ని మరింత బలంగా అందిస్తోంది. ఎస్సేలు, ప్రాజెక్ట్ రిపోర్టులు, లేదా రీసెర్చ్ పేపర్స్ ఏదైనా కావచ్చు కొంత సూచన ఇస్తే, మిగతా పని దీని మీదే వదిలేయవచ్చు. అంతే కాదు, Notebook LM వంటి టూల్స్ ద్వారా విద్యార్థులు తమ శోధన ప్రక్రియను వేగవంతం చేయగలుగుతున్నారు.

Google: ఏఐ జెమిని ప్యాక్ ఉచితమని గూగుల్ కీలక ప్రకటన

క్లాస్ ప్రెజెంటేషన్‌లను సూపర్ క్రియేటివ్‌గా చేయవచ్చు
పాఠ్యపుస్తకాలు, నోట్‌లు, డాక్యుమెంట్లను అర్థం చేసుకొని, కీలకమైన సమాచారం తెస్తుంది. ఇక Veo 3 విషయానికి వస్తే ఇది విద్యార్థుల కల్పనలకు ప్రాణం పోస్తోంది. మీరు టైప్ చేసిన చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్‌ ఆధారంగా, ఫోటో రియలిస్టిక్ వీడియోలను సృష్టిస్తుంది. కేవలం 8 సెకన్ల నిడివి కలిగిన వీడియో మాత్రమే కాకుండా, అందులో క్యారెక్టర్లు మాట్లాడే విధంగా సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా జోడించవచ్చు. ఫిలిం స్టూడియో అవసరం లేకుండా, క్లాస్ ప్రెజెంటేషన్‌లను సూపర్ క్రియేటివ్‌గా మార్చేయొచ్చు.

AI టూల్స్ వినియోగాన్ని మరింత వేగవంతం
AI టూల్స్ వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంలో Whisk కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సాధారణ చిత్రాలను, మీ సూచనల ఆధారంగా వీడియోలుగా మారుస్తుంది. ఒక బొమ్మ చూసి, దానికి కథ చెప్పాలంటే Whisk ఒక మంచి సాధనం. దీంతో పాటు, వీడియో ప్రాజెక్ట్స్‌ను మరింత ప్రొఫెషనల్‌గా డిజైన్ చేయాలనుకునే విద్యార్థుల కోసం Flow అనే ప్రత్యేక ఫిల్మ్‌మెకింగ్ టూల్ కూడా అందుబాటులో ఉంది. స్క్రిప్ట్ నుంచి వీడియో ఫినిషింగ్ వరకూ ఈ టూల్ అన్నింటికీ తోడ్పడుతుంది. Google Workspace యాప్‌లు కూడా ఇప్పుడు AI శక్తితో పని చేస్తున్నాయి. Gmail, Docs, Sheets వంటి యాప్‌ల్లో జెమినై సహాయంతో మెయిల్ లేఖనం, టేబుల్ విశ్లేషణ, కంటెంట్ తయారీ.
అర్హతలు ఏమిటి?
విద్యార్థులు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. స్కూల్ లేదా కళాశాల వివరాలు సమర్పించాలి. 2025 సెప్టెంబర్ 15వ తేది లోపు ఈ ప్లాన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. స్టూడెంట్ ఈమెయిల్ ఐడీ (.edu లేదా కాలేజ్ డొమైన్) ఉండాలి. గూగుల్ వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేయాలి. ఇవన్నీ సరిపోయిన వెంటనే, మీరు వెంటనే ప్రీమియం ఫీచర్లను వాడేయొచ్చు. ఈ ఆఫర్ ఎందుకు స్పెషల్? ఇది సాదా జెమినై యాక్సెస్ కాదండీ. ఇది జెమినై 1.5 ప్రో, అంటే మరింత శక్తివంతమైన వర్షన్ .

గూగుల్ అసలు పేరు ఏమిటి?
వారు ఈ సెర్చ్ ఇంజిన్‌ను బ్యాక్‌రబ్ అని పిలిచారు. ఆ తర్వాత వెంటనే, బ్యాక్‌రబ్‌ను గూగుల్ (phew) అని పేరు మార్చారు. ఈ పేరు 1 తర్వాత 100 సున్నాలు ఉన్న సంఖ్యకు గణిత వ్యక్తీకరణపై ఒక నాటకం మరియు “ప్రపంచ సమాచారాన్ని నిర్వహించడం మరియు దానిని విశ్వవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం మరియు ఉపయోగకరంగా మార్చడం” అనే లారీ మరియు సెర్గీ లక్ష్యాన్ని సముచితంగా ప్రతిబింబిస్తుంది.

గూగుల్ సీఈఓ ఎవరు?
పిచాయ్ సుందరరాజన్ (జననం జూన్ 10, 1972), సుందర్ పిచాయ్ (ఉచ్చారణ: /ˈsʊndɜːr pɪˈtʃeɪ/) గా ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ-అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jos Butler: వాషింగ్టన్ సుందర్ వల్లే టీమిండియా ఓడిపోయింది?

#telugu News AI Tools Free AI Tools India Artificial intelligence Free AI Services Gemini AI Pack Google AI Announcement Google Gemini Google Update Tech News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.