ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా బంగారు(GoldLoans) రుణాల వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) ప్రభుత్వానికి సమర్పించిన కొన్ని కీలక డిమాండ్లు ఆమోదం పొందితే, బంగారం(GoldLoans) తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి వడ్డీ భారంలో గణనీయమైన తగ్గుదల వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా NBFCలకు ప్రాధాన్యత రంగ రుణం (PSL) హోదా కల్పించడం, అలాగే UPI వ్యవస్థతో గోల్డ్ క్రెడిట్ లైన్‌ను అనుసంధానం చేయడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఈ చర్యలు అమలులోకి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, రైతులు తక్కువ వడ్డీతో బంగారు రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: