జూన్ నెలలో తగ్గిన బంగారం ధరలు (Gold Rates)జూలై నెలలో రోజు రోజుకు పెరుగుతున్నాయి.గ్లోబల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడి ధరలు మళ్లీ నింగిని తాకేందుకు రెడీ అవుతున్నాయి. జూలై నెలలో మొదటి మూడు రోజుల్లోనే బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ బంగారం ధర రూ.1 లక్ష మార్క్‌కు దగ్గరలో ఉంది. అమెరికా డాలర్ బలహీనపటలం, అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ నెలకొన్న అస్థిరత.. ట్రంప్ (Trump) టారిఫ్ దూకుడు, అలాగే వాణిజ్య రంగంలో నెలకొన్న అస్థిరత వంటి అంశాలు ఈ సారి బంగార ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
బంగారానికి మళ్లీ డిమాండ్
జూలై 3 తేదీ గురువారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.99,330 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Rates) రూ.91,050 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ నెలలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నగరాలవారీగా బంగారం ధరలు
హైదరాబాద్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది.
ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,150 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,620 నమోదైంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది.
Read Also: Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్