📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Today Gold Rate: ట్రంప్ టారిఫ్ దెబ్బకు భారీగా పెరిగిన పసిడి ధరలు

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు రోజుకు పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం 1,02,560 కి చేరుకుంది. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక వచ్చే అక్టోబర్ నెలలో 25 బేసిస్ పాయింట్లు రేటు తగ్గింపు అంచనాలు బంగారం ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆగస్టు 2 నుంచి 100 గ్రాముల బంగారం ధర 26, 400 పెరగగా..10 గ్రాముల ధర 2,640 పెరిగింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ట్రంప్ టారిఫ్ దెబ్బకు భారీగా పెరిగిన పసిడి ధరలు

ప్రస్తుతం గ్రాము బంగారం ధర
ఆగస్టు 8 శుక్రవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూపాయి పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,256 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము Gold ధర 9,401 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,692 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల Gold రూ.100 పెరిగి రూ. 10,25,600 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 100 పెరిగి రూ. 9,40,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.100 పెరిగి 100 గ్రాములు రూ.7,69,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,920 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,610 గా నమోదైంది.
వివిధ ప్రాంతాల్లో నేటి బంగారం ధరలు
ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,920 గా నమోదైంది. బంగారం నకిలీదా లేక అసలైనదా అని మీ ఇంట్లోనే టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు..ఈ ఏడు చిట్కాలను పాటించండి ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. రూ. రూ.94,160 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,050 గా నమోదైంది. బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,920 గా నమోదైంది.

ఏ దేశ బంగారం అసలైనది?
ప్రపంచంలోనే అత్యుత్తమ బంగారం & బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాలు...
స్థానాన్ని బట్టి బంగారం ధర మారవచ్చు, వివిధ దేశాలలో ఉత్పత్తి అయ్యే బంగారం స్వచ్ఛత మరియు నాణ్యత కూడా మారవచ్చు. స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా మరియు కెనడా వంటి దేశాలు అధిక స్వచ్ఛత గల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి, అయితే చైనా మరియు రష్యా వంటి దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.
బంగారం మూలం ఏమిటి?
బంగారం ఎలా ఏర్పడుతుంది మరియు బంగారం ఎక్కడి నుండి వస్తుంది? | APMEX
బంగారం అనే విలువైన లోహం లోతైన అంతరిక్షంలో ఉద్భవించింది మరియు బిలియన్ల సంవత్సరాల క్రితం సూపర్నోవా పేలుళ్లలో ఏర్పడింది. ఈ హింసాత్మక నక్షత్ర సంఘటనలు బంగారంతో సహా బరువైన మూలకాలను సృష్టించాయి, తరువాత అవి విశ్వం అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ipl-2026-will-rajasthan-royals-hand-over-leadership-responsibilities-to-dhruv-jurel/sports/527785/

Banking profits Financial performance Indian banking sector Latest News Breaking News Quarterly results SBI earnings SBI Q1 Results State Bank of India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.