📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తులం బంగారం రూ. 8,000 తగ్గింది… బంగారం – వెండి మార్కెట్లో డిమాండ్ పెరుగుదలతో కొత్త ఎత్తులు బంగారం కొనుగోలు వారికి ఇవాళ మంచి వార్త… బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కొండెక్కిన బంగారం ధరలు… బంగారం ధరలు పడిపోయాయి భారీగా పెరిగిన పసిడి ధరలు బంగారం ధరలు పరిస్థితి బంగారం ధరలు తగ్గుతాయా? డాలర్ బలహీనత బంగారం ధరపై ప్రభావం తులం బంగారం రూ. 8,000 తగ్గింది… బంగారం – వెండి మార్కెట్లో డిమాండ్ పెరుగుదలతో కొత్త ఎత్తులు బంగారం కొనుగోలు వారికి ఇవాళ మంచి వార్త… బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కొండెక్కిన బంగారం ధరలు… బంగారం ధరలు పడిపోయాయి భారీగా పెరిగిన పసిడి ధరలు బంగారం ధరలు పరిస్థితి బంగారం ధరలు తగ్గుతాయా? డాలర్ బలహీనత బంగారం ధరపై ప్రభావం

Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు

Author Icon By Vanipushpa
Updated: January 14, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు (జనవరి 14, 2026) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం(Gold) ధరలు (gold rates) సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఒక్క రోజే బంగారం ధరలు భారీగా పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. ఎంత పెరిగిందంటే? నేడు ఉదయం ట్రేడింగ్‌ లో ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.50% కంటే ఎక్కువ పెరిగి 10 గ్రాములకు ఏకంగా రూ.1,43,017 మార్కును తాకింది. చూస్తుంటే బంగారం రోజురోజుకీ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. Also Read బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్..నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే.. ఇక వెండి పరిస్థితి మరింత ఆశ్చర్యకరంగా ఉంది. వెండి ధర ఒక్కసారిగా 3 శాతం పైగా దూసుకుపోయి కేజీ రూ. 2,83,598 వద్ద రికార్డు స్థాయికి చేరింది. త్వరలోనే రూ.3 లక్షలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేంటి? అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Read Also: Are You Dead?: చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు

ఇరాన్‌లో చెలరేగుతున్న నిరసనలే కారణాలు

ముఖ్యంగా ఈ కారణాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత: అమెరికాలో ద్రవ్యోల్బణం (Inflation) ఊహించిన దానికంటే తక్కువగా నమోదైంది. దీనివల్ల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గితే సహజంగానే బంగారం ధరలు (gold rates) పెరుగుతాయి. భౌగోళిక ఉద్రిక్తతలు (Geopolitical Risks): ఇరాన్‌లో చెలరేగుతున్న నిరసనలు, అంతర్గత కల్లోలాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. వెనిజులా, గ్రీన్లాండ్ వంటి ప్రాంతాల్లో అమెరికా వైఖరి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేకపోవడం వల్ల ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులు: డాలర్ విలువలో వస్తున్న మార్పులు పసిడి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

commodity market updates global gold trends gold investment news gold price hike Precious Metals Market rising gold rates Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.