బంగారం, వెండి ధరలు (Gold prices) భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది.
Read Also: Jio Star: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్..
బంగారం, వెండి ధరలు (Gold prices) రికార్డు స్థాయికి చేరాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.51 లక్షలు, వెండి ధర కిలో రూ.4 లక్షల దిశగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరగగా డాలర్ విలువ నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
హైదరాబాద్‌లో (Hyderabad) కిలో వెండి రూ.3.75 లక్షలుగా ఉంది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.26,821 పెరిగి రూ.3.83 లక్షలకు పలికి రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం రూ.1.62 లక్షలకు పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: