గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం బార్ల దిగుమతులపై అమెరికా(America) సుంకాలు విధించబోతుందనే వార్తలతో బులియన్ మార్కెట్లో Gold ధరలు ఆ మధ్య ఒక్కసారిగా పెరిగాయి. అయితే ట్రంప్(Trump) ఎటువంటి సుంకాలు విధించడం లేదని చెప్పడంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. Gold మీద సుంకాలు లేకపోవడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇతర ఆస్తుల వైపు వాటిని మళ్లించారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఈ రోజు 100 గ్రాముల Gold ధర రూ.100 తగ్గింది. భారత్-అమెరికా(India-America) దేశాల మధ్య సుంకాల వార్ దెబ్బకి బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు తొలి వారంలో 10 గ్రాముల ధర దాదాపు రూ. 6 వేలకు పైగానే పెరిగింది. తాజాగా పసిడి నేల చూపులు చూస్తోంది. వచ్చే పండుగ సీజన్ నేపథ్యంలో Gold ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బుధవారం బంగారం ధరలు
పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం రూపాయి తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,139 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,294 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,604 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ. 10,13,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.100 తగ్గి రూ. 9,29,400 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.100 తగ్గి 100 గ్రాములు రూ.7,60,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
వివిధ నగరాల్లో పసిడి ధరలు
విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,390 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,940 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,040 గా నమోదైంది. చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,390 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,390 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,940 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,040 గా నమోదైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,540 దగ్గర ట్రేడ్ అవుతోంది.
అహమ్మదాబాద్ లో: 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,440 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,990 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,080 గా నమోదైంది. బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,390 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,940 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,040 గా నమోదైంది. కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,390 దగ్గర ట్రేడ్ అవుతోంది.
అధిక స్వచ్ఛత (91.6%):
916 బంగారం అధిక స్థాయి స్వచ్ఛతను అందిస్తుంది, ఇది ఆభరణాలు మరియు ఇతర అనువర్తనాలకు విలువైన మరియు కావాల్సిన పదార్థంగా మారుతుంది.
KDM పూర్తి రూపం ఏమిటి?
KDM బంగారం యొక్క పూర్తి రూపం ఏమిటి? KDM అంటే "కాడ్మియం". KDM అనేది బంగారం శుద్ధి ప్రక్రియ, ఇది బంగారం యొక్క మన్నిక మరియు వశ్యతను పెంచడానికి కాడ్మియం అనే లోహాన్ని ఉపయోగిస్తుంది. ఇది బంగారాన్ని దాని స్వచ్ఛతను కాపాడుకుంటూ సంక్లిష్టమైన ఆభరణాల ముక్కలుగా తయారు చేయవచ్చని నిర్ధారించే ఒక సాంకేతికత.
Read hindi news:hindi.vaartha.com
Read also: