📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Gold Price Today: తగ్గిన బంగారం ధరలు

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 1:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Rates) రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత మూడు రోజుల క్రితం ఢిల్లీ(Delhi)లో లక్ష మార్కును తాకిన బంగారం ధర ఇప్పుడు కొంచెం తగ్గి పసిడి ప్రియులకు ఊరటను కల్పించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump).ఈ మధ్య యూరోపియన్ యూనియన్, మెక్సికో(Mexico) నుండి దిగుమతులపై 30 శాతం సుంకం విధిస్తామని హెచ్చరికల తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్టుబడిదారులు ఈ హెచ్చరికలతో మళ్లీ బంగారం వైపు తమ దృష్టిని నిలిపారు.

సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం

అగ్రరాజ్యం అమెరికా గ్లోబల్ వాణిజ్య సుంకాల విధానం వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడికి బంగారంను ఎంచుకుంటున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పుడ తగ్గినా సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, US డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న బలహీనత, వాణిజ్య సంబంధిత సంఘటనల కారణంగా, రాబోయే వారంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 30% సుంకాలు ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి.

Gold Price Today: తగ్గిన బంగారం ధరలు

బుధవారం బంగారం ధరలు

జూలై 16, బుధవారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 49 రూపాయిలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,928 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 45 రూపాయిలు తగ్గి 9,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 37 రూపాయిలు తగ్గి రూ.7,446 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 4,900 తగ్గి రూ. 9,92,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.4,500 తగ్గి రూ. 9,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 3,700 తగ్గి రూ. 7, 44,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,460 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jos Butler: వాషింగ్టన్ సుందర్ వల్లే టీమిండియా ఓడిపోయింది?

#telugu News gold investment Gold Market Trends Gold Price today gold rate drop gold rate news Indian Bullion Market Jewellery Prices Latest News Breaking News precious metals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.