📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gold Rates Today: 100 గ్రాములకు రూ.5,500 పెరిగిన పసిడి ధరలు

Author Icon By Vanipushpa
Updated: July 8, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పసిడి ధరలు(Gold Rates) తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పెరిగాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయం(International)గా నెలకున్న పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తీసుకోబోయే కీలక నిర్ణయాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరగడంతో పసిడి ప్రియుల్లో నిరాశ నెలకొందనే చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే అమెరికా(America)లో ఆగస్ట్ 1 నుంచి డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌(Tariff)లు అమలులోకి రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 10% ప్రాథమిక టారిఫ్‌ను అమలు చేశారు. అయితే ఎక్కువ దేశాలకు ఈ టారిఫ్ అమలు తేదీని వాయిదా వేశారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం.. అమెరికా ఇప్పటికీ అనేక బహుళ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసే దశలో ఉంది. రేపటి నుంచి కొత్త అధిక సుంకాల రేట్లను ఇతర దేశాలకు తెలియజేయనుంది. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే, ఈ మూడు వారాలు ప్రభావిత దేశాలకు చర్చలు కొనసాగించడానికి గడువుగా ఉన్నాయి.
ఈ వార్తలతో పాటు గత వారం విడుదలైన బలమైన అమెరికా ఉద్యోగాల డేటా వలన ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలను తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సుంకాల ప్రభావం ఉంటుంది కాబట్టి, ఫెడ్ జూలైలో రేట్లు తగ్గించకుండా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లు కూడా ఇప్పుడు సంవత్సరాంతానికి గరిష్ఠంగా రెండు తక్కువ వడ్డీ రేట్ల కోతలే ఉంటాయని భావిస్తున్నాయి. ఈ అంశాలతో బంగారం ధరలు నిన్న తగ్గుముఖం పట్టినా మళ్లీ ఈ రోజు పెరిగాయి.

Gold Rates Today: 100 గ్రాములకు రూ.5,500 పెరిగిన పసిడి ధరలు

మంగళవారం భారతదేశంలో బంగారం ధరలు

జూలై 8 తేదీ మంగళవారం భారతదేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 55 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,884 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.50 పెరిగి 9,060 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 41 పెరిగి రూ.7,413 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 5500 పెరిగి 9,88,400కు చేరుకుంది. ఇక 2 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 5000 పెరిగి 9,01,000కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 4100 పెరిగి 7,41,300కు చేరుకుంది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,840 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,130 గా నమోదైంది.విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,840 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,130 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలు

చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,750 గా నమోదైంది. ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,130 గా నమోదైంది.ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,990 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,750 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,250 నమోదైంది .

బంగారం అసలు పేరు ఏమిటి?
ఆరం అనే పదం బంగారం యొక్క శాస్త్రీయ నామం మరియు లాటిన్ అంటే బంగారం అని కూడా అర్థం. బంగారం ఒక పరివర్తన మూలకం మరియు ఆవర్తన పట్టికలో దాని పరమాణు సంఖ్య 79ని కలిగి ఉంటుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం మరియు ఆవర్తన పట్టికలో మీరు కనుగొనగలిగే అతి తక్కువ రియాక్టివ్ మూలకాలలో ఒకటి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Electric vehicles: విద్యుత్ వాహనాల విక్రయాలు జంప్

#telugu News 100 grams gold price gold market news gold price hike gold price increase gold price rise gold rate India Gold Rates Today precious metals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.