📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకతలు,విశేషాలు

Author Icon By Rajitha
Updated: December 8, 2025 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. సమిట్ లో తెలంగాణలో పెట్టుబడుల, యువతకు ఉపాధి అవకాశాల, సాంకేతిక, విద్య, ఆరోగ్యం, హెల్త్ టూరిజం రంగాల గురించి వివిధ సెషన్లలో చర్చ జరుగుతుంది. దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరై, రాష్ట్ర అభివృద్ధికి, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడంలో చర్చల ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమిట్ ప్రారంభ సభలో ప్రసంగిస్తారు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు. సమిట్ వేదికను అత్యాధునిక డిజిటల్ టన్నెల్స్, కళాకృతులు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే స్టాల్స్ తో అలంకరించారు.

Read also: Global Summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు 

Global Summit 2025

1,000 కంటే ఎక్కువ CCTV కెమెరాలు

సమిట్ లో నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ CEOs, కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రతినిధులు పాల్గొని తమ సందేశాలను ప్రసారం చేస్తారు. విద్య, వైద్య, టెక్, గ్రీన్ ఎనర్జీ, ఎకనామీ, స్టార్టప్, సృజనాత్మక రంగాలపై 27 విభిన్న సెషన్లు జరగనుండగా, అతిథుల భద్రతకు 2,500 మంది పోలీసులు, 1,000 కంటే ఎక్కువ CCTV కెమెరాలు, ప్రత్యేక మహిళా బృందాలు ఏర్పాటుచేశారు. సమిట్ ముగింపు రోజున సాయంత్రం డ్రోన్ల ద్వారా తెలంగాణ అభివృద్ధి, విజన్ 2047 లక్ష్యాలను ఆకాశంలో ప్రదర్శించడం జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Telangana Rising Global Summit 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.