Global Market: ప్రపంచవ్యాప్తంగా యువతలో వస్తున్న జీవనశైలి మార్పులు ఆల్కహాల్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జెన్ జీ తరం ఆరోగ్యకర జీవన విధానాన్ని అనుసరిస్తూ మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల మద్యం మార్కెట్ డిమాండ్ తగ్గుతోంది.
Read Also:Indus AI App: ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే
కొత్త తరం అలవాట్లు మార్చడంతో మద్య కంపెనీల ఆదాయంపై ప్రభావం
పలువిధమైన నివేదికల ప్రకారం గత నాలుగేళ్లలో ఆల్కహాల్ పరిశ్రమ దాదాపు 839 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. యువత ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యం, స్మార్ట్ లైఫ్‌స్టైల్‌పై దృష్టి పెట్టడం వల్ల సంప్రదాయ మద్య వినియోగం తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్, లో-ఆల్కహాల్ పానీయాల వైపు కంపెనీలు మారాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త తరం అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే ఈ రంగానికి మరింత సవాళ్లు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: