📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gas Price Hike: వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

Author Icon By Tejaswini Y
Updated: March 12, 2026 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gas Price Hike: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు దేశీయ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడటంతో, దీనిని అదనుగా చేసుకున్న కేటుగాళ్లు బ్లాక్ మార్కెటింగ్‌కు తెరలేపారు. ముఖ్యంగా నొయిడా వంటి ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.

Read Also: Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి

Gas Price Hike: Cooking gas is as expensive as a pumpkin..! Cylinder Rs. 2800?

మూడు రెట్లు అధిక ధర

సాధారణంగా మార్కెట్‌లో రూ. 900 నుండి రూ. 950 మధ్య లభించాల్సిన 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర, ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 2,800 వరకు పలుకుతోంది. రిటైలర్లు కిలో గ్యాస్‌ను సుమారు రూ. 200 చొప్పున విక్రయిస్తుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో ఉన్న జనాన్ని, ఈ బ్లాక్ మార్కెటింగ్ మరింత కుంగదీస్తోంది.

దేశవ్యాప్తంగా ఇంధన సెగ

కేవలం నొయిడాలోనే కాకుండా, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కొరతను సృష్టిస్తూ కృత్రిమ డిమాండ్‌ను పెంచుతున్నట్లు సమాచారం అందుతోంది. సరఫరా గొలుసు దెబ్బతినడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ లేదనే సాకుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం మరియు చమురు కంపెనీలు తక్షణమే స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Gas Black Marketing Gas Cylinder Price Gas Cylinder Shortage LPG Gas Price Hike Noida LPG Prices West Asia War Impact

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.