త్వరలో ఇంధన ధరలు(Fuel Prices) పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందుగానే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం(Central Govt)పరిశీలన చేస్తోందని సమాచారం. లీటర్‌కు రూ.3 నుంచి రూ.4 వరకు భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ తన తాజా నివేదికలో పేర్కొంది.
Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రస్తుతం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో బడ్జెట్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంధన ధరల(Diesel Prices) పెంపు అమలైతే రవాణా ఖర్చులు పెరిగే అవకాశముండటంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం అవసరమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: