ఆన్‌లైన్ ఫుడ్ (Food Delivery) డెలివరీ ఇకపై మరింత భారంగా మారబోతోంది. ప్రభుత్వం తాజాగా డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ విధించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. స్విగ్గీ,(Swiggy) జొమాటో, మ్యాజిక్‌పిన్ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ (Food Delivery) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్డర్ చేసే వినియోగదారులు ఇకపై అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, డెలివరీ ఛార్జీ రూ.50 అయితే, దానిపై 18% జీఎస్టీ అంటే మరో రూ.9 అదనంగా చెల్లించాలి. దీంతో మొత్తం డెలివరీ ఛార్జీ రూ.59 అవుతుంది.
Food Delivery
బిల్లు మరింత పెరగనుంది
ఇప్పటికే వినియోగదారులు ఆహారపు ధరపై 5% జీఎస్టీ చెల్లిస్తున్నారు. కానీ ఇప్పటివరకు డెలివరీ (Delivery) ఛార్జీలకు పన్ను నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ మినహాయింపును తొలగించి డెలివరీ సర్వీసులను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. కంపెనీలు ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు పేరుతో రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నాయి. ఈ కొత్త జీఎస్టీ (GST) భారంతో వినియోగదారుల బిల్లు మరింత పెరగనుంది. ముఖ్యంగా చిన్న ఆర్డర్లు చేసే విద్యార్థులు, సామాన్య ప్రజలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పండుగ సీజన్‌లో ఈ నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: