📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

News Telugu: Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Author Icon By Rajitha
Updated: November 23, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పౌర విమానయాన శాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించే దిశగా ముందడుగు వేస్తోంది. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణానికి కొద్దిసేపటి ముందు టికెట్ రద్దు చేసినా, టికెట్ మొత్తంలో పెద్ద భాగం తిరిగి పొందే అవకాశం కల్పించే కొత్త విధానంపై పని జరుగుతోంది. విమాన టికెట్‌లోనే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి భాగంగా చేర్చి, చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ చేసినా 80 శాతం వరకు రీఫండ్ ఇచ్చేలా కేంద్రం చర్యలు ప్రారంభించింది. రాబోయే 2-3 నెలల్లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేందుకు పౌర విమానయాన శాఖ చర్చలు కొనసాగిస్తోంది.

Read also: Arodeep Nandi: డిసెంబర్‌లో RBI రెపోరేటు తగ్గే అవకాశం?

Flight Tickets: Good news for air travelers..

హక్కులను రక్షించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం

ప్రస్తుతం విమానం బయలుదేరే మూడు గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ‘నో-షో’గా పరిగణించి డబ్బులు తిరిగి ఇవ్వరు. కొన్నిసార్లు వైద్య అత్యవసర పరిస్థితులు నిరూపించినప్పుడు మాత్రమే విమానయాన సంస్థలు రీఫండ్ ఇస్తుంటాయి. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు, ఇన్సూరెన్స్ ప్రీమియం భారం ప్రయాణికులపై పడకుండా, విమానయాన సంస్థలే భరించే విధంగా కొత్త ఒప్పందాలు కుదుర్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఈ దిశగా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.

ఇదిలావుండగా, టికెట్ల రీఫండ్ ప్రక్రియపై ప్రయాణికుల నుంచి పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ కూడా నిబంధనల సవరణపై దృష్టి పెట్టింది. ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండేలా రీఫండ్ నియమాలను మార్చేందుకు ముసాయిదా నిబంధనలు సిద్ధం చేస్తోంది. ప్రయాణికుల హక్కులను రక్షించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం అని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Airlines aviation indian government latest news Telugu News travel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.